పురందేశ్వరి కామెంట్స్.మద్యం సేకరిస్తున్న కంపెనీ పేర్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాం.
అయినా నోరు మెదపలేదు.ముఖ్యమంత్రి అధికారంలోకి రాకముందు మద్యం అమ్మినా తయారు చేసిన జైలులో పెడతామన్నారు.
మేం ప్రకటించిన యజమానులను ఎప్పుడు అరెస్టు చేస్తారు.దశలవారీగా మద్యం నిషేధం విధిస్తామన్నారు.
ఆ దిశగా ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలి.మద్యం విక్రయాల్లో లెక్కలోని రాని కోట్ల రూపాయల వివరాలను బహిర్గతం చేయండి.
బెవరేజెస్ ద్వారా తెస్తున్న అప్పుల్లో మద్యపానం నిషేధించం అని చెప్పలేదా.వశిష్ట అనే కంపెనీకి మద్యం ఆన్ లైన్ అమ్మకాల బాధ్యతను అప్పచెప్పారు.
కాని ఎపి ఆన్ లైన్ పనిచేయడం లేదు.మద్యం దుకాణాల్లో నగదు ఇచ్చే చెల్లింపులు మాత్రమే జరగడం వలన కోట్ల రూపాయలు దుర్వినియోగం అవుతున్నాయి.దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి.గ్రామాల్లో బెల్టు షాపులు ఇంకా కొనసాగుతున్నాయి.
దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి.కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి ఎపి ఆర్ధిక వ్యవరాలపై లేఖ ఇచ్చాను.
ఫోరన్సిక్ ఆడిట్ జరిపించాలని కోరాను.బేవరేజ్ కార్పొరేషన్ ఫైనా విచారణ జరిపించాలని కోరాను.