ముఖ్యంగా చెప్పాలంటే చాలా మందికి ఉదయం నిద్ర లేచిన తర్వాత కాఫీ లేదా టీ తాగే అలవాటు కచ్చితంగా ఉంటుంది.మరి కొందరికి ఏవైనా తినే అలవాటు ఉంటుంది.
అలాగే జంక్ ఫుడ్( Junk Food ) లేదా వేడి వేడిగా ఏదైనా స్పైసి ఫుడ్ ఇలా ఏదో ఒకటి తినే అలవాటు కూడా ఉంటుంది.ఏది పడితే అది తినడం వల్ల లేని పోని అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని చెబుతున్నారు.
అందువల్ల ఉదయం పరిగడుపున ఏమి తినాలి.ఏవీ తినకూడదు.
అనే దాని పై ఖచ్చితంగా క్లారిటీ ఉండాలి.లేకపోతే మాత్రం ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
అందుకే ఉదయం నిద్ర లేవగానే పరిగడుపున అసలు తినకూడని కొన్ని ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
![Telugu Acidity, Citrus Fruits, Healthy Fruits, Telugu-Telugu Health Telugu Acidity, Citrus Fruits, Healthy Fruits, Telugu-Telugu Health](https://telugustop.com/wp-content/uploads/2023/10/Avoid-Eating-These-Fruits-Early-Morning.jpg)
ముఖ్యంగా చెప్పాలంటే ఉదయం పూట నారింజ, ద్రాక్ష, నిమ్మ, కివి పండ్లు అస్సలు తినకూడదు.ఎందుకంటే వీటిలో అధిక మొత్తంలో విటమిన్ సి( Vitamin C ) ఉంటుంది.అంతే కాకుండా సిట్రిక్ ఆమ్లం కలిగిన ఈ పండ్లను ఉదయాన్నే పరిగడుపున తినడం వల్ల ఎసిడిటీ( Acidity ) పెరిగే ప్రమాదం ఉంది.
అంతేకాకుండా కడుపులో మంట, ఉబ్బరం వంటి సమస్యలు కూడా వస్తాయి.అలాగే ఉదయం సమయంలో వీటికి దూరంగా ఉండటం ఎంతో మంచిది.ఇంకా చెప్పాలంటే స్పైసి ఫుడ్స్ కూడా తీసుకోకూడదు.ఎందుకంటే గుండెల్లో మంట, కడుపులో ఎలర్జీ వంటివి ఏర్పడడానికి కారణం అవుతాయి.
అంతేకాకుండా స్వీట్స్ మరియు ఎనర్జీ డ్రింక్స్( Energy Drinks ) వంటి వాటికీ కూడా దూరంగా ఉండాలి.ఇవి కూడా పొట్ట సమస్యలను కలిగిస్తాయి.
![Telugu Acidity, Citrus Fruits, Healthy Fruits, Telugu-Telugu Health Telugu Acidity, Citrus Fruits, Healthy Fruits, Telugu-Telugu Health](https://telugustop.com/wp-content/uploads/2023/04/Are-you-eating-these-in-the-morning-on-an-empty-stomach-But-you-asked-for-death-and-got-itb.jpg)
అంతే కాకుండా కాఫీ మరియు టీ( Tea ) తాగే అలవాటు ఉన్నవారు వాటిని కూడా తక్కువగా తీసుకోవాలి.లేదంటే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.ఉదయం సమయంలో వీలైనంతవరకు నట్స్, తేనే, బొప్పాయి వంటివి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.కాబట్టి ఉదయం సమయంలో మనం తీసుకునే ఆహార పదార్థాల పట్ల జాగ్రత్త వహించడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు.