సికింద్రాబాద్ లో అగ్నిప్రమాదం జరిగింది.పాలికాబజారులోని ఓ లేడిస్ షాపింగ్ మాల్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
మంటలు భారీగా ఎగిసిపడటంతో దట్టమైన పొగ అలముకుంది.తీవ్ర భయాందోళనకు గురైన ప్రజలు బయటకు పరుగులు తీశారు.
దీంతో ప్రాణనష్టం తప్పింది.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
ఈ ప్రమాదంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లగా షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని స్థానికులు అనుమానిస్తున్నారు.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.