ప్రముఖ సినీ నటి, వైసీపీ మంత్రి రోజా( YSP minister Roja ) ప్రస్తుతం పొలిటికల్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.ఎన్నికలకు ఆరు నెలల సమయం మాత్రమే ఉండటంతో నగరి నుంచి మరోసారి పోటీ చేసి ఎన్నికల్లో విజయం సాధించాలని ఆమె భావిస్తున్నారు.
బుల్లితెర నటి శ్రీవాణి మీ కడుపునిండా పేరుతో రెస్టారెంట్ బిజినెస్ ను మొదలుపెట్టారు.రోజా చేతుల మీదుగా ఈ రెస్టారెంట్ ప్రారంభం కావడం గమనార్హం.

రెస్టారెంట్ ఓపెనింగ్ తర్వాత రోజా తనకు ఇష్టమైన వంటకాల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించగా ఆ విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.చేపల పులుసు, సంగటి, పీతల ఫ్రై, కీమల ఉండలు, రొయ్యల ఇగురు తనకు ఇష్టమని ఆమె తెలిపారు.కరోనా సమయంలో తాను వంటలు చేశానని రోజా చెప్పుకొచ్చారు.గుడికి వెళ్లే సమయంలో మాత్రం తాను మాంసాహారానికి దూరంగా ఉంటానని ఆమె తెలిపారు.

రోజా చేతుల మీదుగా ఓపెన్ అయిన ఈ రెస్టారెంట్ బిజినెస్ లో శ్రీవాణి ఏ స్థాయిలో సక్సెస్ అవుతారో చూడాల్సి ఉంది.సీరియల్స్, టీవీ షోల ద్వారా వచ్చిన డబ్బును శ్రీవాణి( Srivani ) ఇక్కడ ఇన్వెస్ట్ చేశారని సమాచారం అందుతోంది.శ్రీవాణి ఫుడ్ బిజినెస్ లో సైతం ఊహించని స్థాయిలో సక్సెస్ కావాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. శ్రీవాణికి కెరీర్ పరంగా అనుకూలంగా జరగాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
రోజా నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండగా మరోసారి అనుకూల ఫలితాలు రావడం గ్యారంటీ అని ఆమె భావిస్తున్నారు.రోజా పొలిటికల్ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని 2024లో కూడా ఆమెకు అనుకూల ఫలితాలు రావాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
వైసీపీ( YCP ) మళ్లీ అధికారంలోకి వచ్చి రోజా ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే ఆమెకు మంత్రి పదవి మళ్లీ రావడం గ్యారంటీ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.







