బిగ్ బాస్ 7 సీజన్లోకి కంటెస్టెంట్ గా వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన నయని పావని ( Nayani Pavani ) వెళ్లేటప్పుడు అందర్నీ ఏడిపించి ఒక వారంలోని అందరి మనసులను గెలుచుకుంది.ఇక ఈమె ఎలిమినేట్ అయ్యే సమయంలో హౌస్ లో ఉన్న ప్రతి ఒక్కరిని కన్నీళ్లు పెట్టించింది.
అలాగే తనకి కూడా హౌస్ లోనుండి వెళ్లడం ఇష్టం లేదని తన గేమ్ కూడా ఇంకా ఎవరు చూడలేదని కన్నీళ్లు పెట్టుకుంది.ఇదంతా పక్కన పెడితే హౌస్ లో ఆమె చేతి మీద ఉన్న టాటూ గురించి పూజ మూర్తి ( Pooja murthy ) అది ఏంటి అని అడిగితే ఆ టాటూ నా అది అని సైగ చేసింది.
అయితే ఈ టాటూ వైరల్ అవ్వడంతో ప్రతి ఒక్కరికి నయని చేతి మీద ఉన్న ఆ టాటూ వెనుక అసలు రీసన్ ఏంటి.అసలు ఆ టాటూ ఎవరిదై ఉంటుంది అని అందరూ భావించారు.

అయితే నయని పావని చేతి మీద SJ అనే టాటూ ఉంది.అయితే ఈ టాటూ చూసినా తర్వాత ప్రతి ఒక్కరు షణ్ముఖ్ జస్వంత్ ( Shanmukh jaswanth ) తో నయని పావని ప్రేమలో పడిందని,వీళ్ళిద్దరి మధ్య కొద్దిరోజులు లవ్ ట్రాక్ నడిచి ఆ తర్వాత బ్రేకప్ జరిగింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఈ వార్తలు రావడానికి ప్రధాన కారణం నయని పావని షణ్ముఖ్ జస్వంత్ ఇద్దరు కలిసి గతంలో రెండు కవర్ సాంగ్స్ చేశారు.కానీ ఆ తర్వాత కొద్ది రోజులకే యూట్యూబ్ నుండి వీరు చేసిన కవర్ సాంగులను డిలీట్ చేశారు.
అయితే దీనికి ప్రధాన కారణం వీరిద్దరి మధ్య కొన్ని రోజులు లవ్ ట్రాక్ నడిచి ఆ తర్వాత బ్రేకప్ అయిందని,ఈ కారణం తోనే వీరు ఆ పాటలు డిలీట్ చేశారని ఒక్కసారి గా వార్తలు వైరల్ అయ్యాయి.అయితే వైరల్ అవుతున్న ఆ న్యూస్ లో ఎలాంటి నిజం లేదు అని,అసలు షణ్ముఖ్ జశ్వంత్ కి నాకు ఎలాంటి రిలేషన్ లేదని నా చేతి మీద ఉన్న టాటూ నా మాజీ బాయ్ ఫ్రెండ్ పేరు అని అలాగే ఆ సాంగ్స్ డిలీట్ చేయడానికి కారణం ఏంటి అనేది కూడా నయని పావని ( Nayani Pavani) బయటపెట్టింది.
ఆమె మాట్లాడుతూ.నేను ఓ వ్యక్తితో లవ్ లో పడ్డాను.

కానీ ఆ వ్యక్తి ప్రేమించినప్పటి నుండి ఆయన నాపై పెత్తనం చెలాయించాలని చూశారు.ప్రతిసారి నువ్వు ఓ చిన్న మొక్కవి నిన్ను నేను పెంచుకుంటున్నాను అంటూ చులకన చేసి మాట్లాడారు.అలాగే నా ఇష్టాలన్నీ మార్చేసుకోమన్నారు.నాకంటూ సొంత నిర్ణయం లేకుండా చేశాడు.అందుకే నాకు ఆ బంధం అక్కర్లేదు అనిపించింది.అంతేకాదు ఆ వ్యక్తి నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించడం లేదు.
కేవలం నన్ను సెలెక్ట్ చేసుకొని అతనికి అనుకూలంగా మార్చుకోవాలని చూసుకున్నాడు.కానీ నాకు ఆ రిలేషన్ అవసరం లేదు అనిపించింది.
అందుకే బ్రేకప్ చెప్పాను.ఇక షణ్ముఖ్ జశ్వంత్ ( Shanmukh jaswanth ) తో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు.
అలాగే నా చేతి పైన ఉన్న టాటూ కూడా ఆయనది కాదు.ఇక మా ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన కవర్ సాంగ్స్ డిలీట్ చేయడానికి ప్రధాన కారణం కాపీరైట్ ఇష్యూ వచ్చింది.
అందుకే డిలీట్ చేశారు కానీ మీరు ఏవేవో ఊహించుకోవాల్సిన అవసరం లేదు.అంటూ నయని పావని క్లారిటీ ఇచ్చింది.







