సోషల్ మీడియా ప్రభావం ఎంతలా వుందో ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇక్కడ అనునిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతూ వుంటాయి.
అందులో కొన్ని చాలా సరదాగా ఉంటే, మరికొన్ని చాలా ఆశ్చర్యంగాను, విచిత్రంగాను అనిపిస్తూ వుంటాయి.మరికొన్నిటిని చూసినపుడు చాలా ఆసక్తికరంగా అనిపిస్తాయి.
తాజాగా ఆ రకానికి చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో( Social Media ) వైరల్ కావడం మనం చూడవచ్చును.పిల్లలు మారం చేసే సమయంలో తల్లిదండ్రులు( Parents ) ఎలాగోలా బుజ్జగించి లాలిస్తుంటారు.
మరి కొందరు మాత్రం పిల్లల అల్లరిని భరించలేక వారిపై కోపం ప్రదర్శిస్తుంటారు.
మరి ఇలాంటి సందర్భాలు మనుషుల్లోనే కాదు, జంతువులలోనూ కనిపిస్తాయి.అవును, తాజాగా వైరల్ వీడియోలో ఓ ఏనుగు తనకూ మనుషుల్లాగానే కోపం వస్తుంది అని నిరూపించింది.పిల్ల ఏనుగుపై( Baby Elephant ) కోపంతో నీటిలోకి తోసేసింది.
కాగా దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఓ తల్లి ఏనుగు( Mother Elephant ) తన పిల్ల ఏనుగుతో కలిసి పెద్ద తొట్టిలో ఉన్న నీటిని తాగేందుకు వెళ్తుంది.
ఇక వున్నట్టుంది అక్కడ ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.ఉన్నట్టుండి తల్లి ఏనుగుకు తన పిల్ల ఏనుగుపై విపరీతమైన కోపం వస్తుంది.
కట్ చేస్తే కోపంగా దాని దగ్గరికి వెళ్లి తొండంతో ఎత్తి పక్కన ఉన్న నీటి తొట్టెలో పడేస్తుంది.దాంతో పిల్ల ఏనుగు కావడంతో ఈత రాక పాపం నీటిలో మునిగిపోతుంది.ఇక చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న సమయంలో మరో రెండు ఏనుగులు పరుగు పరుగున అక్కడికి వెళ్తాయి.కంగారుగా అక్కడికి వచ్చిన రెండు ఏనుగులు.”ఏంటమ్మా! ఇలా చేశావ్? అంత కోపం దేనికి?” అన్నట్లుగా.చూసి నీటిలో పడ్డ ఏనుగును కాపాడే ప్రయత్నం చేస్తాయి.
చివరకు ఎంతో కష్టపడి ఎలాగోలా పిల్ల ఏనుగును బయటికి తీస్తాయి.ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు కాగా దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
కొందరు ఏమంటున్నారంటే, అది కోపం కాదు, పిల్ల ఏనుగుకి ఈత నేర్పడం కోసం అలా చేసిందని కామెంట్స్ చేస్తున్నారు.