కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టినటువంటి రష్మిక మందన్న( Rashmika Mandanna ) ప్రస్తుతం తెలుగు తమిళ భాష చిత్రాలలో మాత్రమే కాకుండా హిందీ సినిమా అవకాశాలను కూడా అందుకుని కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు అయితే ఇదివరకు ఈమె హిందీలో నటించిన రెండు సినిమాలు పెద్దగా ఆదరణ పొందలేకపోయాయి.ఈ క్రమంలోనే తన తదుపరి సినిమా యానిమల్ ( Animal ) చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.
అర్జున్ రెడ్డి వంటి బ్లాక్ బాస్టర్ సినిమా ద్వారా ప్రేక్షకులను ఎంతో మెప్పించినటువంటి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy ) దర్శకత్వంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా నటించిన రష్మిక మందన్న హీరోయిన్గా నటించారు.ఇక ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదల చేసినట్టు వంటి ట్రైలర్ లిరికల్ వీడియో కొన్ని పోస్టర్స్ కనుక చూస్తే ఈ వీడియోలో రష్మిక మందన్న రణబీర్ కపూర్ ( Ranbir Kapoor ) బోల్డ్ సన్నివేశాలలో నటించారని స్పష్టంగా అర్థం అవుతుంది.ముఖ్యంగా ఈ సినిమాలో ఎక్కువగా లిప్ లాక్ సన్నివేశాలు ఉన్నాయని అర్థమవుతుంది.
సౌత్ ఇండస్ట్రీలో ఇలాంటి బోల్డ్ సన్నివేశాలలో రష్మిక ఎప్పుడు నటించలేదు అలాంటి ఈమె బాలీవుడ్ సినిమాలలో ఇలా సన్నివేశాలలో నటించారు అనే విషయం తెలియడంతో అందరూ షాక్ అవుతున్నారు.

సౌత్ సినిమాలలో ఎంతో పద్ధతిగా నటించే రష్మిక మందన్నలో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.మరి ఈ సినిమాలో రష్మిక ఇలా లిప్ లాక్ సన్నివేశాలలో( Liplockk Scenes ) నటించడం కోసం భారీ స్థాయిలోనే అదనంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.సినిమాలో నటించడం కోసం ఈమె సుమారు 5 కోట్ల వరకు రెమ్యూనరేషన్( Rashmika 5 Crore Remuneration ) అందుకున్నప్పటికీ లిప్ లాక్ సన్నివేశాలలో నటించడం కోసం అదనంగా రెమ్యూనరేషన్ చార్జ్ చేశారట.
ఇందులో ఒక లిప్ లాక్ సన్నివేశంలో నటించాలి అంటే సుమారు 20 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుందని తెలుస్తుంది.అలా ఎన్ని లిప్ లాక్ సీన్స్ ఉంటే అన్ని 20 లక్షలు ఎక్కువగా రెమ్యూనరేషన్ తీసుకుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియదు కానీ ఈ విషయం వైరల్ కావడంతో అందరూ షాక్ అవుతున్నారు.







