మాస్ మహారాజ రవితేజ( Ravi Teja ) మరో సినిమాతో దసరా బరిలో నిలవబోతున్నాడు.”టైగర్ నాగేశ్వరరావు”( Tiger Nageswara Rao ) అనే పాన్ ఇండియన్ సినిమాతో దసరా బరిలో నిలవబోతున్నాడు.నూతన డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో రవితేజ కూడా పాన్ ఇండియా స్టార్ గా మారడానికి సిద్ధం అవుతున్నాడు.
ఈ సీజన్ లో భారీ పోటీ ఉన్నపటికీ వెనకడుగు వేయడం లేదు.
ఎందుకంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటుంది అనే ధీమా ఉండడంతో చిత్ర యూనిట్ మొత్తం కాన్ఫిడెంట్ గా ఉన్నారు.ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో మేకర్స్ ప్రమోషన్స్ విషయంలో అందరి కంటే ముందుగా ఉన్నారు.
వరుసగా అప్డేట్స్ ఇస్తూ ఆడియెన్స్ లో ఈ సినిమా పేరు నిత్యం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇదిలా ఉండగా ఇది స్టూవర్టుపురం గజదొంగ నిజజీవిత ఆధారంగా తెరకెక్కింది.
దీంతో ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్నాయి.మరి తాజాగా ప్రొడ్యూసర్ ఈ సినిమాలో ఒక సన్నివేశం గురించి చెబుతూ మాస్ రాజా డెడికేషన్ ఇది అంటూ చెప్పుకొచ్చారు.
చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్( Abhishek Agarwal ) మాట్లాడుతూ.

ఇందులో ట్రైన్ దోపిడీ సీన్ ఉంటుందని ట్రైన్ మీద నుండి లోపలి దూకే షాట్ లో రవితేజ అదుపుతప్పి కిందపడగా మోకాలికి గాయం( Knee Injury ) అయ్యిందట.బలమైన గాయం తగలడంతో ఈయనకు 12 కుట్లు పడ్డాయని అయినా ఈయన రెండు రోజులకే షూట్ లో పాల్గొన్నారని తెలిపారు.ఈ షాట్ లో దాదాపు 400 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉండడంతో లేట్ అయితే నిర్మాతకు నష్టం వస్తుందని రెండు రోజుల్లోనే మళ్ళీ షూటింగ్ కు( Shooting ) హాజరు అయ్యారని రెస్ట్ తీసుకోమని చెప్పిన వినలేదని అది ఆయనకు సినిమాపై ఉన్న అంకితభావం అని తెలిపారు.

ఈ కామెంట్స్ విన్న ఫ్యాన్స్ కు ఇది మా మాస్ రాజా అంటే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఈ సినిమా అక్టోబర్ 20న గ్రాండ్ గా రిలీజ్ అవుతుండగా ఈ సినిమాలో నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమాకు జివి ప్రకాష్ కుమార్ స్వరాలు అందిస్తుండగా అభిషేక్ అగర్వాల్ బ్యానర్ పై నిర్మించారు.







