మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా హీరోగా వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి ఈయన తాజాగా భోళా శంకర్ ( Bhola Shankar ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఇక ఈ సినిమా ఎలాంటి డిజాస్టర్ ఎదుర్కొందో మనకు తెలిసిందే.మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లోనే ఇలాంటి డిజాస్టర్ సినిమా లేదని చెప్పాలి.
ఇక ఈ సినిమా డిజాస్టర్ అయిన తర్వాత చిరంజీవి తన తదుపరి సినిమాలపై కాస్త ఫోకస్ పెట్టారని తెలుస్తుంది.ఇదిలా ఉండగా తాజాగా ఒక సమావేశంలో చిరంజీవి పాల్గొన్నారు.
ఈ సమావేశంలో భాగంగా ఈయన పరోక్షంగా రజనీకాంత్ జైలర్ సినిమా గురించి సెటైర్లు వేయడంతో ఒక్కసారిగా ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇటీవలే ఓ సీనియర్ జర్నలిస్టు( Senior Journalist ) పాత్రికేయుల జీవితాల మీద రాసిన పుస్తకాన్ని మెగాస్టార్ తో లాంచ్ చేయించారు.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు.చిరంజీవి ప్రస్తుత ట్రెండ్ కి బోధపడుతున్నట్టు ఉంది.
అయినా సరే కష్టపడే విషయంలో మారేది లేదంటున్నారు. లేటు వయసులో ఒళ్ళు హూనం చేసుకుని డాన్సులు ఫైట్లు కాకుండా ఊరికే అలా నడుచుకుంటూ వచ్చి వెళ్తూ, డైలాగులు చెబితే సంగీత దర్శకుడు రీ రికార్డింగ్ ఎలివేట్ చేస్తే పని అయిపోతుందని ఈయన తెలిపారు కానీ తాను అలా చేయలేనని చిరంజీవి తెలిపారు.

చిరంజీవి ఈ కామెంట్ చేస్తూ ఫలానా సినిమా అని చెప్పకపోయినా ఈయన కచ్చితంగా రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమా(Jailer Movie) గురించే మాట్లాడారని చెప్పాలి రజినీకాంత్ ఈ సినిమాలో అనిరుద్ రవిచందర్ చేసిన మేజిక్ చాలా లోపాలను కవర్ చేసిన సంగతి తెలిసిందే.ఇలా చెప్పుకుంటూ పోతే ఉదాహరణకు ఎన్నో సినిమాలు ఉన్నాయి.ఇలా రజనీకాంత్( Rajinikanth ) మాదిరిగా తాను కూడా వచ్చినా రీ రికార్డింగ్ అన్ని కవర్ చేయాలి అంటే ప్రేక్షకులు ఏమాత్రం ఈ సినిమాని యాక్సెప్ట్ చేయరని తెలిపారు.తన సినిమాలలో పోరాటాలు, డాన్సులు తప్పనిసరిగా ఉండాలని దానికోసం కష్టపడక తప్పదు అంటూ ఈ సందర్భంగా చిరంజీవి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇక మెగా 157లో ఫాంటసీ జానర్ ని టచ్ చేస్తున్నారు కాబట్టి ఈ సినిమా విషయంలో కాస్త రిస్క్ ఉంటుందని తెలుస్తోంది.అయితే ప్రస్తుతం మోకాలి సర్జరీ చేయించుకున్నటువంటి చిరంజీవి డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ పనులలో బిజీ కానున్నారని తెలుస్తోంది.