కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి( Hero Vijay Thalapathy ) హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రాబోతున్న లియో సినిమా భారీ అంచనాల మధ్య దసరా బరిలో అక్టోబర్ 19 విడుదలకు సిద్ధంగా ఉంది.

ఇక విడుదలకు మరి కొద్ధి రోజులు ఉన్న సమయంలో ప్రమోషన్స్ లో వేగాన్ని పెంచుతూ తమ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు.ఇక సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో కొంతమంది కావాలనే విజయ్ మూవీ లియోని తొక్కి వేయాలని దుష్ప్రచారాలు చేస్తున్నారు.ఈ మధ్యకాలంలో డైరెక్టర్ లోకేష్ కనకరాజ్( Lokesh Kanagaraj ) హీరో విజయ్ కి మధ్య గొడవలు వచ్చాయని సోషల్ మీడియాలో పోస్ట్లు వైరల్ అయిన సంగతి మనకు తెలిసిందే.

అయితే ఇందులో ఎలాంటి నిజం లేకపోయినప్పటికీ ఫేక్ పోస్ట్ లు పెట్టి లియో సినిమాని దెబ్బతీయాలని కొంతమంది కావాలనే కంకనం కట్టుకొని చూస్తున్నారని కోలీవుడ్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.అయితే ఓ స్టార్ హీరోయిన్ భర్త మాత్రం విజయ్ లియో సినిమా( Leo ) ప్లాఫ్ కావాలి అని క్షుద్ర పూజలు చేస్తున్నారు అంటూ తాజాగా ఒక వార్త చక్కర్లు కొడుతుంది.ఇక అసలు విషయం ఏమిటంటే.సౌత్ లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార భర్త విగ్నేష్ శివన్ అందరికీ తెలిసే ఉంటుంది.
తన దర్శకత్వంలో కొన్ని సినిమాలు తెరకెక్కించినప్పటికీ స్టార్ డైరెక్టర్( Star Director ) మాత్రం కాలేకపోయారు.ఇక విగ్నేష్ శివన్ విజయ్ లియో మూవీ ప్లాఫ్ కావాలని పూజలు చేస్తున్నారు అంటూ కొంతమంది నెటిజన్స్ ఆరోపిస్తున్నారు.
ఇక ఇలా ప్రచారం చేయడానికి ప్రధాన కారణం లోకేష్ కరకరాజ్ విజయ్ మధ్య గొడవ జరిగింది అని వచ్చిన ఒక పోస్ట్ కి విగ్నేష్ శివన్ లైక్ కొట్టడమే ఇందుకు కారణం.విగ్నేష్ శివన్ ఆ పోస్టుకి లైక్ కొట్టడంతో కొంతమంది కావాలనే విగ్నేష్ శివన్ ( Vignesh Shivan ) ని ట్రోల్ చేస్తూ మా హీరో కి సంబంధించిన ఫేక్ న్యూస్ కి నువ్వు లైక్ కొడతావా.

మా హీరో సినిమా డిజాస్టర్ అవ్వాలని నువ్వు ఏమైనా పూజలు చేయిస్తున్నావా అంటూ నయనతార ( Nayanatara ) భర్త విగ్నేష్ శివన్ ని ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టారు.అయితే ఈ పోస్ట్ పై స్పందించిన విగ్నేష్ శివన్ నేను కావాలని లైక్ కొట్టలేదు.బై మిస్టేక్ లో లైక్ బటన్ మీద టచ్ అయింది అంతే అంటూ తన తప్పును కప్పిపుచ్చుకున్నప్పటికీ విజయ్ అభిమానులు మాత్రం విగ్నేష్ శివన్ కావాలనే ఈ పని చేశారు అంటూ ఆరోపిస్తున్నారు.







