టీడీపీ అధినేత చంద్రబాబు తరపు న్యాయవాదులు దాఖలు చేసిన రైట్ టు ఆడియన్స్ పిటిషన్ డిస్మిస్ అయింది.ఈ మేరకు విజయవాడలోని ఏసీబీ కోర్టు పిటిషన్ ను కొట్టివేసింది.
ఏపీ ఫైబర్ గ్రిడ్, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో విచారణకు ముందు తమ వాదనలు వినాలని కోరుతూ కోర్టులో చంద్రబాబు న్యాయవాదులు పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
కాగా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.







