Prabhas : రోడ్డు పక్కన అవి కనిపిస్తే అసలు వదలను… అర్థరాత్రి సమయంలో ఇదేం పాడలవాటు ప్రభాస్?

కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి ప్రభాస్ ( Prabhas ) ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.బాహుబలి సినిమాతో స్టార్ హీరోగా మారినటువంటి ఈయన ఈ సినిమా తర్వాత చేసే సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

 Prabhas Midnight Cravings Will Shock You-TeluguStop.com

తాజాగా సలార్ ( Salaar ) సినిమా ద్వారా ప్రేక్షకులు ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల ఈ సినిమా వాయిదా పడింది.ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీ విడుదలకు సిద్ధమవుతుందని మేకర్స్ ప్రకటించారు.

ఇలా సినిమాల పరంగా ఎంతో సక్సెస్ అందుకున్నటువంటి ప్రభాస్ వ్యక్తిగత జీవితంలో కూడా చాలా సరదాగా సంతోషంగా ఉన్నారని విషయం మనకు తెలిసిందే.అయితే ప్రస్తుతం ప్రబాస్ నాలుగు పదుల వయసులో ఉన్నప్పటికీ పెళ్లి చేసుకోకపోవడంతో అభిమానులు ప్రభాస్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారా అనే ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఇక ప్రభాస్ గురించి ఇదివరకు ఎంతోమంది హీరోయిన్స్ సెలబ్రిటీలు మాట్లాడుతూ ఆయన ఫుడ్ చాలా ఇష్టంగా తింటారని ఆయన తినడమే కాకుండా అంతే ఇష్టంగా ఇతరులకు కూడా పెడుతూ ఉంటారని చెప్పిన సందర్భాలు మనకు తెలిసిందే.

ఇక ఈ అలవాటు ప్రభాస్ కి తన పెదనాన్న కృష్ణ రాజు ( Krishnam Raju )నుంచి వచ్చిందని చెప్పాలి.ఇకపోతే గతంలో ప్రభాస్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ తన ఆహారపు అలవాట్ల గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.మంచు లక్ష్మి వ్యాఖ్యాతగా ఎన్నో కార్యక్రమాలను నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే.

మంచు లక్ష్మి ( Manchu Lakshmi )వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రభాస్ పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన తనకు ఇష్టమైనటువంటి ఆహారపు అలవాట్ల గురించి తెలిపారు.

రోడ్డు పక్కన పానీపూరి కనపడితే చాలు కచ్చితంగా తినాల్సిందేనని ప్రభాస్ తెలిపారు.అది ఎలా ఉన్నా నాకు సంబంధం లేదు పానీ పూరి చూస్తే మాత్రం అసలు ఆగనని ప్రభాస్ తెలిపారు .

ఇక ఈ అలవాటు మాత్రమే కాకుండా ఇంకా ఏమి తినడం అంటే ఇష్టము అంటూ లక్ష్మీ ప్రసన్న అడగడంతో అర్ధరాత్రి 12 గంటల సమయంలో బండిపై ఇడ్లీలు తినడం అంటే కూడా నాకు చాలా ఇష్టం అంటూ ఈ సందర్భంగా ప్రభాస్ ( Prabhas )రోడ్ సైడ్ ఫుడ్ గురించి చెబుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి అయితే ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఉన్న సమయంలో ఈయన ఇలాంటి రోడ్ సైడ్ కూడా తినడానికి ఇష్టపడతానని చెప్పారు.మరి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరో అయిన తర్వాత ఈయన రేంజ్ మారిపోయిందని చెప్పాలి.ఇక పాన్ ఇండియా స్టార్ అయిన తర్వాత కూడా ప్రభాస్ కి ఇలాంటి ఫుడ్ అలవాట్లు ఉన్నాయో లేదో తెలియదు కానీ ఒకప్పుడు మాత్రం ఈయన రోడ్ సైడ్ ఫుడ్ తినడానికి ఎంతో ఇష్టమంటూ చేసిన ఈ కామెంట్స్ మాత్రం వైరల్ అవుతున్నాయి.

https://www.instagram.com/reel/CyLcueMBvgz/?igshid=MmU2YjMzNjRlOQ==
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube