ఓటుకు నోటు కేసుపై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా అందుబాటులో లేరన్న కారణంతో విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేయాలని చంద్రబాబు తరపు న్యాయవాది కోరారు.
ఈ క్రమంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు.దీనిపై వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం విచారణ తేదీని ఖరారు చేస్తామని తెలిపింది.
ఓటుకు నోటు కేసును సీబీఐకి బదిలీ చేయాలని చంద్రబాబు పాత్రపై దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టులో ఆళ్ల రామకృష్ణా రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.అలాగే ఓటుకు నోటు కేసు సీబీఐకి బదిలీ చేయాలని మరో పిటిషన్ దాఖలైంది.
కాగా ఈ కేసు 2017వ సంవత్సరం నుంచి సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉందన్న విషయం విదితమే.







