సిరిసిల్ల లో కేటీఆర్ కు చిక్కులు తప్పవా ? 

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,  మంత్రి కేటీఆర్ ( KTR )కు వచ్చే ఎన్నికల్లో సిరిసిల్ల నియోజకవర్గంలో చిక్కులు తప్పేలా కనిపించడం లేదు.  గత ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలిచిన కేటీఆర్ ఈసారి జరగబోయే ఎన్నికల్లో ఏ స్థాయిలో ప్రభావం చూపిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

 Are There Any Complications For Ktr In Sirisilla , Telangana Government, Tel-TeluguStop.com

మూడోసారి బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధిస్తే సీఎంగా కేటీఆర్ , కెసిఆర్( CM kcr ) ను నియమిస్తారని అంతా భావిస్తున్నారు.  అయితే ఇప్పుడు సిరిసిల్లలో( Sirisilla ) కేటీఆర్ గెలుపు పై అనుమానాలు మొదలయ్యాయి.

  దీనికి కారణాలు చాలా ఉన్నాయి .

Telugu Telangana-Politics

2009 అసెంబ్లీ ఎన్నికల్లో  స్వల్ప ఓట్ల తేడాతో కేటీఆర్( KTR ) గెలిచారు.2018 ఎన్నికల్లో 89 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో సిరిసిల్ల నుంచి గెలిచారు .అయితే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తారా లేదా ?  గెలిచినా గత ఎన్నికల స్థాయిలో మెజారిటీ వస్తుందా రాదా అనేది తేలాల్సి ఉంది.  దీనికి కారణం సిరిసిల్ల నియోజకవర్గంలో పద్మశాలి సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ.రెండోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సిరిసిల్ల నియోజకవర్గాన్ని కేటీఆర్ అభివృద్ధి పథంలో నడిపించారు.

అయినా సిరిసిల్ల నియోజకవర్గం( Sirisilla Constituency )లో మారుతున్న రాజకీయ పరిణామాలు కేటీఆర్ కు ఇబ్బందికరంగా మారాయి .

Telugu Telangana-Politics

 రాష్ట్ర వ్యాప్తంగా పద్మశాలీలు నాలుగు లక్షలు ఉన్నారు.దీంతో ఆ సామాజిక వర్గానికి పెద్దపీట వేయాలని,  రాజకీయంగా ప్రాధాన్యం కల్పించాలని అన్ని పార్టీలను కోరుతున్నారు.  ఇటీవల కోరుట్లలో జరిగిన పద్మశాలి మహాగర్జన సభలో అనేక తీర్మానాలు చేశారు.

ఈ సభలో లక్ష మందికి పైగా పద్మశాలీలు పార్టీలకు అతీతంగా పాల్గొని విజయవంతం చేశారు.తమ సామాజిక వర్గానికి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో సీట్లు కేటాయించాలో అన్ని కేటాయించాల్సిందేనని రాజకీయ పార్టీలకు అల్టిమేటం ఇచ్చారు.

తమ సామాజిక వర్గానికి సీట్లు ప్రకటించని పార్టీకి తమ మద్దతు ఉండబోదని , అలాగే రాష్ట్రవ్యాప్తంగా పద్మశాలీలు ఎక్కడ నుంచి పోటీ చేసినా పార్టీలకు అతీతంగా మద్దతు పలకాలని ఈ సభలో తీర్మానించారు. సిరిసిల్లలో దాదాపు 80 వేలకు పైగా పద్మశాలీల ఓట్లు ఉన్నాయి.

తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంచుకుని ఏకపక్ష నిర్ణయంతో వీరంతా కలిసి ఉంటే కేటీఆర్ ) KTR )కు ఇబ్బందులు తప్పకపోవచ్చు అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube