విజయ్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన లియో మూవీ( LEO movie ) థియేటర్లలో రిలీజ్ కావడానికి మరో 10 రోజుల సమయం ఉంది.ట్రైలర్ పై కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేస్తున్నా లియో మూవీ మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే మూవీ అవుతుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
విజయ్ లోకేశ్ కాంబినేషన్ లో గతంలో మాస్టర్ మూవీ తెరకెక్కగా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అబవ్ యావరేజ్ గా నిలిచింది.

మాస్టర్ విషయంలో జరిగిన తప్పులు లియో విషయంలో జరగకుండా లోకేశ్ కనగరాజ్( Lokesh kanagaraj ) జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది.విజయ్( Thalapathy Vijay ) లోకేశ్ కనగరాజ్ మధ్య మంచి అనుబంధం ఉందని సమాచారం.విజయ్ ను లోకేశ్ కనగరాజ్ అన్న అని పిలుస్తారని తెలుస్తోంది.
విజయ్ తో లోకేశ్ కనగరాజ్ కు గ్యాప్ ఉందని వార్తలు వినిపిస్తుండగా ఆ వార్తల గురించి లోకేశ్ కనగరాజ్ స్పందించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

వైరల్ అయిన వార్తలను విని తాను, విజయ్ ( Thalapathy Vijay )నవ్వుకున్నామని వెల్లడించారు.ఎంతోమంది స్టార్ హీరోలతో నేను పని చేసినా ఎవరినీ అన్నా అని పిలవలేదని నేను అన్నా అని పిలిచిన ఏకైక హీరో విజయ్ మాత్రమేనని లోకేశ్ కనగరాజ్ పేర్కొన్నారు.లియో ట్రైలర్ ను విజయ్ మూడుసార్లు రిపీట్ మోడ్ లో చూశాడని లోకేశ్ కనగరాజ్ చెప్పుకొచ్చారు.
ఈ సినిమాలోని ఒక ఫైట్ సీన్ ను 20 రోజులు షూట్ చేశామని ఆయన చెప్పుకొచ్చారు.లియో సినిమాలో కూడా బిర్యానీ సీక్వెన్స్ ఉంటుందని లోకేశ్ కనగరాజ్ ( Lokesh kanagaraj )చెప్పుకొచ్చారు.
తన కామెంట్లతో లోకేశ్ కనగరాజ్ ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశారు.ప్రేక్షకులు ఎంజాయ్ చేసే ఎన్నో విషయాలను సినిమాలో దాచి ఉంచామని లోకేశ్ కనగరాజ్ పేర్కొన్నారు.
లోకేశ్ కనగరాజ్ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







