ఏడేళ్ల క్రితం స్నేహితుడి సహాయంతో నాన్-రెసిడెంట్ ఇండియన్ (ఎన్‌ఆర్‌ఐ) భర్తను హతమార్చిన బ్రిటిష్ మహిళకు( British woman ) శనివారం భారత యూపీ కోర్టు మరణశిక్ష విధించింది.యూకే పౌరసత్వం గల ఈ మహిళకు భర్తను చంపేయడంలో ఒక స్నేహితుడు హెల్ప్ చేశాడు.
ఆ స్నేహితుడు కూడా దోషిగా నిర్ధారణ అయింది, అతనికి జీవిత ఖైదు విధించబడింది.మూడు లక్షల ఫైన్ కూడా విధించడం జరిగింది.
ఆ కిరాతక భార్య పేరు రమణదీప్ కౌర్.మరణించిన భర్త పేరు సుఖజీత్ సింగ్ ( Sukhjeet Singh )భార్య.
మృతుడు సుఖ్‌జీత్ సింగ్ భారతదేశంలోని బసంతపూర్‌కు ( Basantapur )చెందిన 34 ఏళ్ల వ్యక్తి.అతను ఉద్యోగం కోసం 2002లో ఇంగ్లాండ్‌కు వెళ్లి అక్కడ డెర్బీలో నివాసముంటున్న రమణదీప్ కౌర్‌తో స్నేహం చేశాడు.
సుఖ్‌జీత్‌కు డ్రైవర్‌గా ఉద్యోగం వచ్చింది.2005లో రమణ్‌దీప్‌ని( Ramandeep ) వివాహం చేసుకున్నాడు.2016, జులై 28న సుఖ్‌జీత్, రమణదీప్, వారి కుమారులు భారతదేశంలోని షాజహాన్‌పూర్‌కు సెలవుపై వెళ్లారు.2016, సెప్టెంబర్ 1న సుఖ్‌జీత్ తన కుమారులు అర్జున్, ఆర్యన్‌లతో కలిసి నిద్రిస్తుండగా, రమణదీప్, ఆమె స్నేహితుడు గురుప్రీత్ సింగ్ పదునైన ఆయుధంతో అతనిపై దాడి చేశారు.ఆ సమయంలో అర్జున్ వయసు 9 ఏళ్లు, ఆర్యన్ వయసు 7 ఏళ్లు.ఈ కేసులో నిందితులుగా రమణదీప్, గుర్‌ప్రీత్‌లను అరెస్టు చేసి జైలుకు పంపారు.

సుఖ్‌జీత్ హత్యకు గురైన తర్వాత, రమణదీప్ తల్లిదండ్రులు తమ మనవళ్లను కస్టడీలోకి తీసుకునేందుకు ఇంగ్లండ్‌లోని కోర్టును ఆశ్రయించారు.కానీ కోర్టు నో చెప్పింది, పిల్లలు తమ తండ్రి కుటుంబంతో కలిసి జీవించాలని ఆదేశించింది.భారతదేశంలో విచారణ సందర్భంగా, అర్జున్ మాట్లాడుతూ తన తండ్రితో కలిసి నిద్రిస్తున్నప్పుడు తన తల్లి తండ్రిని దిండుతో ఉక్కిరిబిక్కిరి చేసిందని కోర్టుకు చెప్పాడు.ఆపై గురుప్రీత్ సుఖ్‌జీత్ తలపై సుత్తితో కొట్టాడని, తర్వాత గుర్‌ప్రీత్ జేబులోంచి కత్తి తీసి రమణదీప్‌కి ఇవ్వడంతో ఆమె సుఖ్‌జీత్ గొంతు కోసిందని చెప్పాడు.

కోర్టు నిర్ణయాన్ని భారత ప్రభుత్వానికి, బ్రిటిష్ హైకమిషన్‌కు పంపుతున్నట్లు పోలీసు సూపరింటెండెంట్ తెలిపారు.బ్రిటీష్ పౌరుడికి భారత కోర్టు మరణశిక్ష విధించవచ్చా అని అడిగినప్పుడు, ప్రభుత్వ న్యాయవాది “అవును, ఎందుకంటే నేరం భారతదేశంలో జరిగింది.బాధితుడి కుటుంబం అక్కడే నివసిస్తుంది.బ్రిటీష్ మహిళ నేరానికి ముందు, తరువాత భారతదేశంలో నివసించింది.కాబట్టి ఇండియన్ కోర్టు మరణశిక్ష విధించవచ్చు.” అని స్పష్టం చేశారు.







