సినిమా ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రాఘవ లారెన్స్ టాప్ కొరియోగ్రాఫర్ గా ఎదిగాడు.ముఖ్యంగా చిరంజీవి లాంటి స్టార్ హీరోలు సైతం ఆయన సినిమాలో ఒక సాంగ్ కి లారెన్స్ తో కొరియోగ్రఫీ చేయించుకుంటారు అంటే ఎంత మాత్రం అతిశయోక్తి కాదు.
ఆయన కొరియోగ్రఫీ అంతా స్టైలిష్ గా అంతా బాగుంటుంది అని చిరంజీవి గారు చాలాసార్లు స్టేజి మీద చెప్పడం జరిగింది.అలాంటి రాఘవ లారెన్స్( Raghava Lawrence ) మాస్ సినిమాతో తెలుగులో డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు.

ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో ఆ తర్వాత ఆయన చేసిన డాన్, స్టైల్, కాంచన సిరీస్ లు సూపర్ సక్సెస్ అయ్యాయి.ఇక ప్రస్తుతం ఏ సినిమా చేస్తున్నాడు అనే దాని మీద ఒక క్లారిటీ అయితే లేదు కానీ రీసెంట్ గా పి వాసు డైరెక్షన్ లో వచ్చిన చంద్రముఖి 2( Chandramukhi 2 ) సినిమాలో హీరోగా నటించిన లారెన్స్ ఆ పాత్ర లో తనదైన మార్క్ నటనని చూపిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.bఅయితే ఈయన నటన పరంగా బాగావచేసినప్పటికి ఈ సినిమా చంద్రముఖి లెవల్లో లేకపోవడం వల్ల డిజాస్టర్ అయినట్టుగా తెలుస్తుంది.

ఇక ప్రస్తుతం లారెన్స్ మళ్లీ డైరెక్షన్ చేస్తాడా లేదా నటుడుగానే కొనసాగుతాడా అనే విషయం తెలియాల్సి ఉంది.ఆయన రెబల్ స్టార్ ప్రభాస్ తో రెబల్( Rebel ) అనే సినిమా తీసి మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నాడు.ఇక ఈ సినిమా విషయం పక్కన పెడితే ఈ సినిమాలో ప్రభాస్ ను చాలా స్టైలిష్ గా చూపించాడు అనే పేరు మాత్రం సంపాదించుకున్నాడు.
ఇక ఈ సినిమాతో లారెన్స్ కమర్షియల్ డైరెక్టర్ గా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు……అయితే ఆయన బాలీవుడ్ లో కూడా కాంచన సినిమా ని అక్షయ్ కుమార్ తో రీమేక్ చేసి మంచి విజయాన్ని అందుకున్నారు…
.







