ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజ యాప్ వాట్సాప్( Whatsapp ) ఫుల్ మోడ్ లో దూసుకుపోతోంది.సోషల్ మీడియాలో వస్తున్న పోటీని తట్టుకొనేందుకు, అదేవిధంగా తమ కస్టమర్ల భద్రత విషయమై ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ ను అందిస్తూ ముందుకు పోతోంది.
కొన్నాళ్లనుండి దాదాపు ప్రతి రోజు ఏదో ఒక అప్డేట్ ఇస్తూ వినియోగదారులను ఖుషీ చేస్తోంది.ఇక దీని ద్వారా మెసేజ్‌లతోపాటు వీడియోలు, ఫొటోలు, ఫైల్స్ ఆడియో, వీడియో కాల్స్ మాట్లాడుకునే సౌలభ్యం ఉండడంతో ప్రపంచంలో ఇపుడు అత్యంత ఎక్కువ మంది వాట్సాప్‌ను వాడుతున్న పరిస్థితి వుంది.

మొన్నటికి మొన్నే వాట్సాప్ లో వీడియో రికార్డింగ్ ఫీచర్ ను అందించిన వాట్సప్ కంపెనీ ఇప్పుడు మరో కొత్త ఫీచర్ ను తీసుకు రావడం విశేషం.తాజా సమాచారం ప్రకారం ఇందులో ‘రిప్లయ్ ఆప్షన్( Reply option )’ అనేది 2 ముఖ్యమైన ప్రయోజనాలను కలిగి వుంటుంది.ప్రస్తుతం స్క్రీన్ నుంచి నిష్క్రమించకుండానే ఇతరులకు సమాధానం ఇవ్వడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.అలాగే వీడియో, ఫోటోలు, జిఫ్‌లను చూసేటప్పుడు కూడా వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరుస్తుంది.ఇక ఇపుడు కొత్తగా రిప్లయ్ బార్ అనేది ప్రస్తుత స్క్రీన్‌ను తీసివేయకుండా చాట్‌లోని నిర్దిష్ట మీడియాకు త్వరగా స్పందించడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.

అంటే ఇక్కడ షేర్ చేసిన కంటెంట్‌కు సంబంధించిన సందర్భాన్ని మార్చకుండా చేస్తుందని పలువురు విశ్లేషకులు పేర్కొంటున్నారు.స్క్రీన్ అంతరాయాల తగ్గింపు కారణంగా ఈ ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చినట్టు తెలుస్తోంది.ఇకపోతే వాట్సాప్ అప్‌డేట్‌ల పేజీ కోసం సెర్చ్ ఫంక్షన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు కూడా పలు నివేదికలు చెబుతున్నాయి.
ముఖ్యంగా ఛానెల్ డైరెక్టరీని సందర్శించాల్సిన అవసరం లేకుండా వినియోగదారులు స్టేటస్ అప్‌డేట్స్( Status updates ) తో పాటు, ఇతర ధ్రువీకరించిన ఛానెల్‌ను తేలికగా వెతుక్కోవచ్చన్నమాట.ఇంకా స్టేటస్ మార్పును కూడా తేలికగా చూడవచ్చు.







