వైసీపీ ప్రభుత్వం గ్రామ స్వరాజ్య నిర్మాణానికి కృషి చేస్తోందని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ అన్నారు.ఒంగోలులో ఇళ్ల స్థలాల విషయంలో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి గందరగోళం సృష్టిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
ఈ క్రమంలోనే అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలినేని డిమాండ్ చేశారు.అక్రమాలు ఎవరు చేసినా పార్టీలకు అతీతంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
బాధితులు తన వద్దకు వస్తే వారి స్థలాలను తిరిగి ఇప్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు.అనంతరం రానున్న ఎన్నికల్లో మళ్లీ వైసీపీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.