దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నయనతార ( Nayanatara ) ఒకరు.ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె సౌత్ ఇండస్ట్రీలో ఇప్పటికీ అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు.
తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి కూడా అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే జవాన్ సినిమా( Jawan Movie )ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినటువంటి ఈమె మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.ఇక నయనతార ఎలాంటి స్టార్ హీరోల సరసన నటించిన సినిమా ప్రమోషన్లకు రారు అనే విషయం మనకు తెలిసిందే.
ఇలా నయనతార ( Nayanatara ) సినిమా ప్రమోషన్లకు రాకపోవడం గురించి ఎన్నో రకాల వార్తలో వచ్చాయి.అయితే తాజాగా నయనతార భర్త విగ్నేష్ శివన్ ( Vignesh Shivan ) ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ నయనతార సినిమా ప్రమోషన్లకు ఎందుకు హాజరు కాదు అనే విషయాలను వెల్లడించారు.తమ పిల్లల మొదటి పుట్టినరోజు వేడుకలను మలేషియాలో ఏర్పాటు చేసిన సంగతి మనకు తెలిసిందే.అయితే విగ్నేష్ ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు 9 స్కిన్ అనే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ బిజినెస్ లోకి అడుగు పెట్టారు.
ఈ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయడం కోసం మలేషియా వెళ్లి అక్కడ ప్రెస్ మీట్ పెట్టారు.
ఈ సందర్భంగా విగ్నేష్ మాట్లాడుతూ నయనతార ( Nayanatara ) తన సొంత బ్యానర్ లో తెరకెక్కిన సినిమాలకు కూడా ప్రమోట్ చేయరు.ఇలా ప్రమోషన్లకు ఎందుకు హాజరు కాదు అనే విషయాల గురించి ఈయన మాట్లాడుతూ నయనతార సినిమాలపై చాలా నమ్మకం ఉంటేనే సినిమాలలో నటిస్తారు.సినిమా కథలో సత్తా ఉంటే సినిమాలను ప్రమోట్ చేయాల్సిన పనిలేదని ఆ సినిమాని ప్రేక్షకులను రీచ్ అవుతాయని నమ్ముతారు అందుకే ఆమె సినిమాలకు వెళ్లరు ఇక ప్రకటనల విషయానికి వస్తే ఏదైనా ఒక ప్రకటన చేసే ముందు దాని గురించి పూర్తిగా తెలుసుకుని ఆ విషయాన్ని తాను నమ్మితేనే ప్రచారకర్తగా వ్యవహరిస్తుందని ఈయన తెలియజేశారు.
ఇలా నయనతార ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు కొన్ని బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే.ఇక తన భర్త ప్రారంభించిన 9స్కిన్ కేర్ ప్రోడక్ట్లను కూడా నయనతార ముందుగా ఉపయోగించి వాటి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ఈ వ్యాపారంలోకి అడుగు పెట్టామని ఈయన తెలియజేశారు.
ఇలా మొదటిసారి విగ్నేష్ ( Vignesh Shivan )స్పందిస్తూ నయనతార సినిమా ప్రమోషన్లకు ఎందుకు హాజరు కారు అనే విషయాలను వెల్లడించారు.ఇక తన సినీ కెరియర్ నయనతార సినిమాతోనే ప్రారంభమైందని మొదటి సినిమా కథ చెప్పడానికి నయనతార వద్దకు కాస్త భయపడుతూనే వెళ్లానని అయితే ఆమె నాకు ఇచ్చినటువంటి మర్యాద అలాగే తనలో ఉన్నటువంటి నీతి నిజాయితీ నాకు ఎంతగానో నచ్చాయని అవే తనలో ప్రేమలో పడేలా చేశాయని ఈయన తెలియచేశారు.