యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) లైనప్ లో చాలా క్రేజీ ప్రాజెక్టులు ఉండగా అన్ని కూడా వేటికవే అంచనాలను క్రియేట్ చేసుకున్నాయి.మరి ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్టులలో ”సలార్” ఒకటి.
సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) దర్శకత్వంలో ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతుంది.ఈ సినిమా కోసం ఆడియెన్స్ అంతా ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.

సెప్టెంబర్ 28న రిలీజ్ కావాల్సిన సినిమా వాయిదా పడి డిసెంబర్ కు వెళ్ళింది.ప్రభాస్ ఊర మాస్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా డిసెంబర్ 22న రిలీజ్( Salaar Movie Release ) చేస్తామని నిన్న అధికారికంగా ప్రకటించారు.దీంతో ఈ ఏడాదినే ఈ సినిమా రాబోతుంది అని డార్లింగ్ ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నారు.
అయితే డిసెంబర్ లోనే మేకర్స్ రిలీజ్ ఎందుకు ఫిక్స్ చేసారు? నవంబర్ లో కూడా ఫిక్స్ చేసి ఉండవచ్చు కదా అనే అనుమానం అందరిలో కలిగింది.అందుకు కారణం ఉందట.నవంబర్ లో ఈ సినిమాను రిలీజ్ చేసే పోజిబులిటీ ఉన్నప్పటికి మేకర్స్ డిసెంబర్ నాటికీ ఎందుకు ఫిక్స్ చేసారు అంటే దాని వెనుక కారణం ఉందట.

ప్రభాస్ ఇటీవలే తన కాలుకు సర్జరీ( Prabhas Leg Surgery ) చేయించుకోగా పూర్తిగా కోలుకోవడానికి నవంబర్ వరకు సమయం పడుతుందట.ముందుగా దీపావళికి అనుకున్న ప్రభాస్ కు రెస్ట్ లేకుండా పోతుంది.అంతేకాదు ప్రమోషన్స్ బాగా చేయాల్సి ఉంటుంది.ఇంత హడావిడిలో ప్రభాస్ ఆరోగ్యం మీద ఎఫెక్ట్ పడుతుందనే కారణంతోనే డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయ్యారట.అప్పుడు అయితే ఎలాంటి కంగారు లేకుండా ప్రశాంతంగా అన్ని ప్లానింగ్ ప్రకారం వెళ్లే అవకాశం ఉంటుందని అలా చేశారట.ఇది మొత్తానికి రీజన్ అని తెలుస్తుంది.







