టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ ( Vijay Deverakonda ) తాజాగా ఖుషి సినిమా( Kushi Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.చాలా రోజుల నుంచి హిట్ సినిమా కోసం ఎంతో తపన పడుతున్నటువంటి విజయ్ దేవరకొండకు ఖుషి సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో ఈయన ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు.
ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమాలపై కూడా ఫోకస్ పెట్టారు.సినిమాలో షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.
ఇకపోతే రష్మిక ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలను కూడా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.
తాజాగా ఈమె సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ) దర్శకత్వంలో బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ ( Animal ) సినిమాలో నటిస్తున్నారు.ఇక నేడు రణబీర్ కపూర్ పుట్టినరోజు కావడంతో ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు.ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక ఈ టీజర్ నటుడు విజయ్ దేవరకొండకు తెగ నచ్చడంతో ఈయన ఈ టీజర్ ని ఉద్దేశిస్తూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.మై డార్లింగ్స్ సందీప్ రెడ్డి వంగా, రష్మిక.అలాగే నాకెంతో ఇష్టమైన నటుడు రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor)కు ఆల్ ది బెస్ట్ అలాగే తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు అని కూడా తెలియజేశారు.
ఇలా ఈ సినిమా టీజర్ పై విజయ్ దేవరకొండ రియాక్ట్ అవుతూ చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ తెలియజేయడంతో రష్మిక ( Rashmika )విజయ్ దేవరకొండ చేసిన ట్వీట్ కి రిప్లై ఇచ్చారు.ఈ సందర్భంగా రష్మిక రియాక్ట్ అవుతూ థాంక్యూ విజయ్ దేవరకొండ.
నువ్వు ఎప్పటికీ ది బెస్ట్… అంటూ రిప్లై ఇవ్వడంతో ఈ పోస్టులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.దీంతో నెట్టిజెన్స్ వారికి తోచిన విధంగా ఈ పోస్టులపై కామెంట్స్ చేస్తున్నారు.