సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు చాలా మంది ప్రజలలో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.మెట్రో ట్రైన్‌ను( Metro train) కూడా వారు వదలడం లేదు.
వారు రైళ్లలో చేస్తున్న స్టంట్స్ వైరల్ అవుతూ చర్చనీయాంశమవుతున్నాయి.అయితే కొందరు పిచ్చి చేష్టలు చేస్తుంటే మరికొందరు తమ టాలెంట్ చూపించి ఫిదా చేస్తున్నారు.
తాజాగా మెట్రో ట్రైన్‌లో ఒక యువతి జవాన్( Jawan ) సినిమాలోని షారుఖ్ ఖాన్ లాగా డ్యాన్స్ చేసి వావ్ అనిపించింది.ఆమె బ్యాండేజ్ చుట్టిన లుక్, షారుఖ్ సినిమాలో ధరించిన దుస్తులను ధరించింది.
ఆమె పాటలోని ప్రతి బీట్‌కు మ్యాచ్ అయ్యేలా డ్యాన్స్ స్టెప్పులను రీక్రియేట్ చేసింది.

ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన సహేలీ రుద్ర( Saheli Rudra ), తాను మెట్రోలో డ్యాన్స్ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.వీడియోలో, ఆమె జవాన్‌లో షారుఖ్ ఖాన్ మాదిరిగానే బ్యాండేజ్ చుట్టిన లుక్, ఆ సన్నివేశంలో అతను ధరించిన దుస్తులను ధరించి కాలు కదిపింది.“లేడీ జవాన్” అని ఆమె వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది.మెట్రో రైలులో “బెకరర్ కర్కే హమే యున్ నా జైయే” పాటకు పాత్ర నృత్యం చేస్తుంది.యువతి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది, దానికి లక్షల వ్యూస్ , లైక్‌లు వచ్చాయి.
జవాన్ సన్నివేశానికి జీవం పోసినందుకు అభిమానులు ఆమెను ప్రశంసించారు.చాలా బాగా చేశారంటూ మరి కొందరు ఆమెను పొగిడారు.
ఇలాంటి టాలెంటెడ్ అమ్మాయిలను బాగా ఎంకరేజ్ చేయాలని ఇంకొందరు కామెంట్స్ చేశారు.ఇలాంటి ప్రొఫెషనల్ డాన్సర్లు ఈ తరహా వీడియోలను మరిన్ని చేసి పబ్లిక్‌ను ఎంటర్‌టైన్ చేయాలని మరి కొందరు వ్యాఖ్యలు చేశారు.
ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.







