క్వెస్ట్ 3 మిక్స్డ్-రియాలిటీ హెడ్‌సెట్‌ను ఆవిష్కరించిన మెటా.. స్పెక్స్, ధరలివే..!

టెక్ దిగ్గజం మెటా క్వెస్ట్ 3( Meta Quest 3 ) అనే కొత్త VR హెడ్‌సెట్‌ను తాజాగా ఆవిష్కరించింది.ఇది మునుపటి మోడల్ కంటే సన్నని డిజైన్, ఫాస్టర్ ప్రాసెసర్‌తో వస్తుంది.

 Meta Quest 3 Mixed Reality Headset Specs And Price Details, Meta Quest 3, New He-TeluguStop.com

ఇది హై-రిజల్యూషన్ డిస్‌ప్లే, మెటా రియాలిటీ అనే కొత్త మిక్స్డ్-రియాలిటీ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంది.మెటా రియాలిటీ వర్చువల్ రియాలిటీ (VR), మిక్స్డ్-రియాలిటీ (MR) సామర్థ్యాలను ఈ ఒకే పరికరంలో మిళితం చేస్తుంది.

క్వెస్ట్ 3 తక్కువ ధరలోనే 2023 చివరలో అందుబాటులో ఉంటుంది.ఆల్రెడీ ప్రీ బుకింగ్స్‌ ఓపెన్ అయ్యాయి.

అక్టోబర్‌లో డెలివరీలు ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది.

కొత్త VR హెడ్‌సెట్‌ అయిన మెటా క్వెస్ట్ 3ను మిక్స్డ్-రియాలిటీ (XR) కోసం కూడా ఉపయోగించవచ్చు.

XR అనేది వాస్తవ ప్రపంచాన్ని వర్చువల్ ప్రపంచంతో మిళితం చేసే సాంకేతికత.VR, XR మధ్య మారడానికి, వినియోగదారులు హెడ్‌సెట్ వైపు రెండుసార్లు నొక్కాలి.ఉదాహరణకు, సినిమా చూడటానికి లేదా గేమ్ ఆడటానికి VRని ఉపయోగించవచ్చు, ఆపై వెబ్‌ని బ్రౌజ్ చేయడానికి లేదా ఫోటోలను చూడటానికి XRకి మారవచ్చు.XR మోడ్‌లో, చుట్టూ ఉన్న వాస్తవ ప్రపంచం పైన డేటా, ఇమేజ్‌లు అతివ్యాప్తి చెందుతాయి.

Telugu Meta Quest, Metaquest, Reality, Headset, Products, Tech, Virtualreality-L

క్వెస్ట్ 3 మునుపటి మోడల్ కంటే 30% అధిక రిజల్యూషన్ డిస్‌ప్లేను కలిగి ఉంది, అలాగే కొత్త లెన్స్‌లు, క్వాల్‌కమ్( Qualcomm ) నుండి ఫాస్టర్ చిప్‌ను పొందుతుంది.డ్యూయల్-కలర్ పాస్-త్రూ కెమెరాలను కూడా కలిగి ఉంది, ఇది యూజర్లు హెడ్‌సెట్ ధరించినప్పుడు కూడా వారి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడటానికి అనుమతిస్తుంది.

Telugu Meta Quest, Metaquest, Reality, Headset, Products, Tech, Virtualreality-L

మెటా క్వెస్ట్ 3 మునుపటి మోడల్ క్వెస్ట్ 2 కంటే రెండింతలు ప్రాసెసింగ్ పవర్‌ను కలిగి ఉంది.దీనర్థం ఇది గ్రాఫిక్‌లను మెరుగ్గా అందించగలదు, మరింత స్మూత్ గా రన్ చేయగలదు, యాప్‌లను వేగంగా లోడ్ చేయగలదు.క్వెస్ట్ 3 కూడా క్వెస్ట్ 2 కంటే సన్నగా ఉంటుంది.మెరుగైన స్పీకర్లు, కొత్త కంట్రోలర్లను కలిగి ఉంది.ఇది మునుపటి వెర్షన్స్‌ పోలి ఉంటుంది, కానీ దీనికి ముందు భాగంలో మూడు సెన్సార్లు ఉన్నాయి.సెన్సార్‌లలో రెండు కెమెరాలు, మూడవ సెన్సార్ వినియోగదారు గదిలో వస్తువులు గోడలు ఎక్కడ ఉన్నాయో గుర్తించగలదు.కొత్త సెన్సార్‌ను గేమింగ్ కోసం కూడా ఉపయోగించవచ్చు, ఈ డివైజ్ 128GB వేరియంట్‌ ధర 499.99 డాలర్లు, 512GB మోడల్‌ ధర 649.99 డాలర్లుగా కంపెనీ నిర్ణయించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube