చిరంజీవిపై విమర్శలకు కారణమైన పెంకుటిల్లు కథ ఇదే.. ఆ ఇంటి వల్ల ఇన్ని ఇబ్బందులా?

మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) తన సినిమాలతో అభిమానులను ఎంతగానో ఆకట్టుకోవడంతో పాటు ఫ్యాన్స్ కు ఎంతగానో దగ్గరయ్యారు.ఒక్కో సినిమాకు చిరంజీవి రెమ్యునరేషన్ 50 నుంచి 60 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.

 Fans Always Continuousy Coming To See Chiranjeevis House In His Town Mogalturu-TeluguStop.com

సీనియర్ స్టార్ హీరోలలో రెమ్యునరేషన్ విషయంలో చిరంజీవిని కొట్టే హీరో అయితే లేరని ఇండస్ట్రీలో టాక్ ఉంది.అయితే అప్పట్లోనే చిరంజీవి రెమ్యునరేషన్ విషయంలో రికార్డులు క్రియేట్ చేశారు.

అప్పట్లో అమితాబ్ కంటే ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ తీసుకోవడం ద్వారా వార్తల్లో నిలిచారు.అయితే మొగల్తూరు( Mogalturu )లో చిరంజీవి నివశించిన ఇల్లును లైబ్రరీకి ఇవ్వకుండా మెగాస్టార్ 3 లక్షల రూపాయలకు అమ్మేశారని గతంలో వార్తలు, విమర్శలు వచ్చాయి.

అయితే వాస్తవం ఏంటంటే ఆ ఇల్లు చిరంజీవి మేనమామ గారి ఇల్లు కాగా ఆ ఇంటిపై మెగాస్టార్ కు ఎలాంటి అధికారం లేదు.అయితే కొంతమంది కావాలని చిరంజీవిపై విమర్శలు చేశారు.

Telugu Chiranjeevi, Tollywood, Town Mogalturu-Movie

చిరంజీవి ప్రస్తుతం రీమేక్ సినిమాలకు దూరంగా ఉన్నారు.రీఎంట్రీలో చిరంజీవి నటించిన రీమేక్ సినిమాలలో ఎక్కువ సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకోవడంతో ఇకపై చిరంజీవి రీమేక్ లకు దూరంగా ఉండనున్నారు.చిరంజీవి వశిష్ట( Mallidi Vasishta ) కాంబినేషన్ మూవీ మాత్రం నవంబర్ నెల నుంచి మొదలుకానుండగా ఈ సినిమా వచ్చే ఏడాది సెకండాఫ్ లో విడుదల కానుందని సమాచారం అందుతోంది.

Telugu Chiranjeevi, Tollywood, Town Mogalturu-Movie

చిరంజీవి వశిష్ట సినిమా పూర్తైన తర్వాత మాత్రమే కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారని తెలుస్తోంది.చిరంజీవి పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ సాధించాలని అదే సమయంలో కమర్షియల్ గా భారీ హిట్లు సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.చిరంజీవి తర్వాత సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

చిరంజీవి వరుస ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉండగా వయస్సుకు తగిన కథలను మెగాస్టార్ ఎంచుకోవాలని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube