బిగ్ బాస్( Bigg Boss ) సీజన్ సెవెన్ కార్యక్రమం ప్రస్తుతం నాలుగో వారం కొనసాగుతుంది ఈ వారంలో భాగంగా పవర్ అస్త్ర కోసం పోటీ మొదలైంది.ఆట సందీప్, శివాజీ, శోభా శెట్టి పౌర అస్త్ర గెలిచారు.
వాళ్ళు ముగ్గురు కంటెండర్స్ అయ్యారు.ఇక నాలుగవ పవర్ అస్త్ర కోసం బిగ్ బాస్( Bigg Boss ) బ్యాంక్ టాస్క్ నిర్వహించారు.

ఇందులో భాగంగా గార్డెన్ ఏరియాలో ఉన్నటువంటి ఏటీఎంలో నుంచి ఎవరు ఎక్కువ కాయిన్స్ సాధిస్తారో వారే ఈ వీక్ పవర్ అస్ట్రా గెలిచినట్టు అని ప్రకటించారు.ఇక బ్యాంకర్స్ గా శివాజీ, సందీప్, శోభా వ్యవహరిస్తారని చెప్పాడు.ఎవరు గార్డెన్ లో ఉన్నటువంటి ఏటీఎం వద్దకు వెళ్లి ఎక్కువగా బేబీ కాయిన్స్( Baby Coins ) సాధిస్తారో వారే ఈ టాస్కులో గెలిచినట్టు అని చెప్పారు.

దీంతో బజర్ మోగగానే అందరూ కూడా గార్డెన్ ఏరియాలో ఉన్నటువంటి ఏటీఎం ల వద్దకు పరుగులు పెట్టారు.అయితే ఈ తోపులాటలో భాగంగా పల్లవి ప్రశాంత్ ( Pallavi Prashanth ) గాయాలు పాలయ్యారు.దీంతో ఈయన తలకు పెద్ద ఎత్తున గాయం తగిలిందని తాజాగా విడుదల చేసిన ప్రోమో ద్వారా తెలుస్తుంది.
ఒక్కసారిగా పల్లవి ప్రశాంతి ఎలా గాయాలు పాలు కావడంతో హౌస్ సభ్యులందరూ కూడా కంగారు వ్యక్తం చేశారు మరి ఈయనకు ఎంత మొత్తంలో గాయం తగిలింది ఏంటి అనే విషయం తెలియాలి అంటే ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు వేచి చూడాలి.







