తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలు ఢిల్లీ బాట పట్టారు.ఈసారి తమ కోటా సీట్ల సంఖ్యను పెంచాలంటూ గళం వినిపిస్తున్నారు.
ఈ మేరకు ప్రతి పార్లమెంట్ పరిధిలో రెండు అసెంబ్లీ స్థానాలు బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇప్పటికే సీట్ల విషయంపై తెలంగాణ పొలిటికల్ అఫైర్స్ కమిటీలో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
ఈ నిర్ణయం ప్రకారం బీసీలకు టికెట్లు కేటాయించాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు మాణిక్ రావు ఠాక్రేలకు వినతిపత్రం అందించారు.
తాజాగా ఢిల్లీ బాట పట్టిన బీసీ నేతలు పార్టీ అధిష్టానంతో సీట్ల సంఖ్యపై చర్చించనున్నారు.ఈ క్రమంలోనే ఇవాళ రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేకు బీసీ నేతలు వినతిపత్రం అందజేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ముఖ్యమైన నేతలకు సీట్లు కేటాయించాలని, ఈ మేరకు బీసీలకు మొత్తం 40 నియోజకవర్గాలను కేటాయించాలని పట్టుబడుతున్న సంగతి తెలిసిందే.








