అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై మరికాసేపటిలో విచారణ జరగనుంది.ఈ మేరకు మధ్యాహ్నం 2.15 నిమిషాలకు ఏపీ హైకోర్టు పిటిషన్ ను విచారించనుంది.
కాగా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ఏ1గా ఉన్న సంగతి తెలిసిందే.
అయితే ఇవాళ ఇదే కేసులో నారా లోకేశ్ ను ఏ14 గా పేర్కొంటూ సీఐడీ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది.కాగా ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు తరపు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కాగా అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని గతంలో చంద్రబాబు ప్రభుత్వం చేపట్టింది.ఈ క్రమంలోనే ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ లో మార్పులు చేశారని ప్రస్తుత ప్రభుత్వంతో పాటు సీఐడీ ఆరోపణలు చేసింది.







