సినిమా ఇండస్ట్రీలో మొదట ఎన్టీఆర్( NTR ) ఒక స్టార్ హీరోగా వెలుగొందాడు.ఇక విశ్వ విఖ్యాత నటసార్వాభౌముడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు.
ఆ తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్ సీఎం గా కూడా ఎదిగి పేదల గుండెల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.ఆ తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన చిరంజీవి మెగాస్టార్ గా ఎదిగాడు ఒక సామాన్య మానవుడు కూడా మెగాస్టార్ అవ్వచ్చు అని నిరూపించిన చిరంజీవి( Chiranjeevi ) గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.
అయితే చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చిన కెరియర్ మొదట్లో ఆయన హీరో అవుదాం అనుకున్నప్పుడు ప్రొడ్యూసర్ల దగ్గరికి వెళ్లి అవకాశాల కోసం అడుగేవాడట.అందులో చాలామంది ప్రొడ్యూసర్లు ఆయనని రిజెక్ట్ చేశారు.అయిన కూడా ఆయన పట్టు వదలని విక్రమార్కుడి లాగా ప్రతి సినిమా ఆఫీస్ కి వెళ్లి అవకాశం కోసం అడిగి మొత్తానికి ఏదో ఒక సినిమాలో చిన్న క్యారెక్టర్లు చేస్తూ స్టార్ హీరోగా ఎదిగాడు.అయితే ఈయన చిన్న క్యారెక్టర్లు చేస్తున్న సమయంలో నువ్వు ఎప్పటికీ హీరోవి కాలేవు అని చిరంజీవి మొహం మీద అనేసారంట దాంతో చిరంజీవి స్టార్ హీరో అవుతాను కానీ మీ బ్యానర్ లో మాత్రం సినిమా చేయను అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పి అక్కడి నుంచి బయటికి వచ్చాడట.
ఇక ఆ తర్వాత చిరంజీవి చిన్న చిన్న సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా ఎదిగాడు ఆ స్టార్ ప్రొడ్యూసర్ చేసిన వాఖ్యలు మాత్రం గుండెల్లో అలాగే గుచ్చుకున్నాయట.ఈయన స్టార్ హీరో అయిన తర్వాత ఆ ప్రొడ్యూసర్ వచ్చి ఒక సినిమా చేద్దాం అని చిరంజీవిని అడిగాడు కాని చిరంజీవి జరిగిన ఏవి పట్టించుకోకుండా తన బ్యానర్లో ఒక సినిమా చేశాడు.చిరంజీవి వాళ్ల బ్యానర్ లో చేసిన ఫస్ట్ అండ్ లాస్ట్ సినిమా అదే.చిరంజీవి తనని అవమానించిన వారిని కూడా ఆదరించాడు అందుకే ఆయన మెగాస్టార్ అయ్యాడు అని ఆయన గురించి అందరూ చాలా గొప్పగా చెప్పుకుంటారు.