ప్రస్తుత సమాజంలో చిన్న పిల్లలపై కూడా లైంగిక వేధింపులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి.పోక్సో, నిర్భయ, దిశ లాంటి కఠినమైన చట్టాలను తీసుకువచ్చి ఎంత కఠినంగా శిక్షించిన కూడా సమాజంలో ఉండే కొందరు కామాంధులలో మార్పు అనేది లేదు.
ఈ కామాంధుల కంటికి ఒంటరిగా కనిపిస్తే చాలు లైంగిక దాడికి పాల్పడి తమ కామ వాంఛను తీర్చుకుంటున్నారు.హైదరాబాద్ లోని ( Hyderabad ) బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి ఒంటరిగా ఉండే బాలుడిపై గురువారం లైంగిక దాడికి పాల్పడ్డాడు.
అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.
వివరాల్లోకెళితే.బోరబండ( Borabanda ) సైట్ 3, బ్రాహ్మణవాడ బస్తికి చెందిన దంపతులు కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు.వీరికి ఏడేళ్ల కుమారుడు సంతానం.
రోజు మాదిరిగానే గురువారం ఉదయం ఈ దంపతులు కూలీ పనులకు వెళ్లారు.ఏడేళ్ల బాలుడు( Boy ) స్కూలుకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చి ఆడుకుంటూ ఉన్నాడు.
అయితే ఆ ఇంటి సమీపంలో ఒక పాన్ షాప్ నిర్వహిస్తున్న సయ్యద్ రాహుఫ్ (65)( Sayed Raoof ) అనే వ్యక్తి ఆ ఏడేళ్ల బాలుడిని షాపులోకి పిలిచి లైగింక దాడికి పాల్పడ్డాడు.
అయితే ఆ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడడం పక్కనే ఉండే మరో వ్యక్తి చూశాడు.గురువారం సాయంత్రం ఆ బాలుడు తల్లిదండ్రులు ఇంటికి వచ్చాక వారికి ఈ వ్యక్తి జరిగిన ఘటన గురించి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది.తల్లిదండ్రులు బాలుడిని ఏం జరిగింది అని ప్రశ్నించగా.
మూడు రోజుల నుండి తనపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడని, ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడని తెలిపాడు.వెంటనే బంధువులు, ఇతర స్థానికుల సహాయంతో బోరబండ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించి సయ్యద్ రాహుఫ్ పై ఫిర్యాదు చేశారు.