Pallavi Prashanth Rathika: మళ్లీ పులిహోర కలపడం మొదలు పెట్టిన ప్రశాంత్.. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన రతిక?

ఇటీవలే తెలుగులో మొదలైన బిగ్ బాస్ సీజన్ సెవెన్( Bigg Boss 7 ) అప్పుడే చూస్తుండగానే రెండు వారాలను పూర్తి చేసుకుంది.అలాగే ఇప్పటికే ఇద్దరు కంటెస్టెంట్ లు కూడా ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.

 Bigg Boss 7 Telugu Promo Rathika Serious Warning To Pallavi Prashanth-TeluguStop.com

మొదటి వారం కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అవ్వగా రెండవ వారం షకీలా ఎలిమినేట్ అయ్యింది.ఇకపోతే మూడవ వారం జరిగిన నామినేషన్స్ లో ఏకంగా ఏడుగురు నిలిచారు.

అయితే ఈసారి సోమవారం ఎపిసోడ్ కాస్త ప్లెయిన్ గానే జరిగినప్పటికీ ఆ తర్వాత గొడవలు, స్కెచ్‌లు, టాస్కులతో హౌస్ అంతా హీటెక్కిపోయింది.

Telugu Bigg Boss, Biggboss, Rathika, Rathikapallavi-Movie

తొలివారం రతికతో ప్రశాంత్ గట్టిగా పులిహోర కలిపేశాడు.రెండో వారం వచ్చేసరికి అది కాస్త పెద్దగా వర్క్ ఔట్ అవ్వలేదు.దీంతో ఇద్దరూ మాట్లాడుకోవడమే మానేశారు.

మూడోవారం వచ్చేసరికి మళ్లీ మొదటికొచ్చారు.తన మైండ్ బ్లాంక్ అయిపోయిందని రతిక( Rathika ) ఏడుస్తుంటే ఆమెని కూల్ చేసేందుకు ప్రశాంత్( Pallavi Prasanth ) ఫర్టింగ్ చేశాడు.

కంట్లో నుంచి నీళ్లు రాకుండా పాలలెక్క వస్తున్నాయి ఏందని అన్నాడు.దీంతో ఆమె సిగ్గు పడిపోతూ నవ్వేసింది.

అలా ప్రశాంత్ మళ్లీ రతికతో పులిహోర కలపడం మొదలుపెట్టాడు.ఆ తర్వాత మళ్లీ రతిక పల్లవి ప్రశాంత్ ఉన్నట్టుండి గొడవపడ్డారు.

హే పో అని ప్రశాంత్.రతికని టచ్ చేస్తూ అరిచాడు.

Telugu Bigg Boss, Biggboss, Rathika, Rathikapallavi-Movie

దీంతో సీరియస్ అయిన రతిక, మర్యాదగా ఉండదు చెబుతున్నా అంటూ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది.అయితే అసలు ఎందుకు గొడవపడ్డారు? ఏం జరిగిందనేది తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే మరి.అయితే బిగ్ బాస్ ని చూస్తున్న ప్రేక్షకులకు రతిక అలాగే ప్రశాంత్ ల రిలేషన్ ఏంటో వారి మధ్య స్వభావాలు ఏంటి అనేది అర్థం కావడం లేదు.అప్పుడే ప్రేమగా మాట్లాడుతూ పులిహోర కలపడం అంతలోనే మాట్లాడుకోవడం చూడడానికి కాస్త కామెడీగానే ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube