బిగ్ బాస్( Bigg Boss ) సీజన్ సెవెన్ కార్యక్రమం ప్రసారమవుతూ పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇప్పటికే ఈ కార్యక్రమం రెండు వారాలను పూర్తి చేసుకుని ఇద్దరు కంటెస్టెంట్లు హౌస్ నుంచి బయటకు వెళ్లారు.
ఇక రెండవ వారంలో భాగంగా నటి షకీలా( Shakeela ) హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.ఇక బిగ్ బాస్ హౌస్ లో ఎలిమినేట్ అయినటువంటి ఈమె బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లారు.
ఈ కార్యక్రమంలో భాగంగా షకీలా మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు.
బిగ్ బాస్ బజ్ కార్యక్రమంలో భాగంగా గీతు రాయల్ ( Geethu Royal ) అడిగే ప్రశ్నలకు ఈమె సమాధానాలు చెప్పారు.అదేవిధంగా హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ ల గురించి మాట్లాడుతూ షకీల చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.శోభా శెట్టి.
హౌజ్లో ఒక మాస్క్ తో ఉందని చెప్పింది.అమర్ దీప్ చిన్న విషయానికి కూడా తట్టుకోలేరు.
ఇక యావర్ ఎదవ అని ఈమె చెప్పేసారు.ఇక పల్లవి ప్రశాంత్ సెంటిమెంట్ అనే ఒక డ్రగ్ లో మునిగి తేలుతున్నారు అంటూ ఆయన ఆటిట్యూడ్ గురించి తెలియజేశారు.
ఇక ఆ ఇంట్లో ఉండాల్సిన అర్హత ఎవరికైనా ఉంది అంటే అది కేవలం సందీప్ మాస్టర్ కే అంటూ షకీలా తెలియజేశారు.ఇలా హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్లు అందరూ గురించి మాట్లాడుతూ ఈమె చివరికి నేను చనిపోతే వీరందరూ కూడా నన్ను చూడటానికి రావాలి అంటూ కామెంట్స్ చేయడం వైరల్ గా మారింది.