సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా ఎక్కువ రోజులపాటు కొనసాగాలి అంటే వాళ్ల ప్రొఫెషన్ లో వాళ్లు రోజు రోజుకి అప్డేట్ అవుతూ ఉండాలి.ఒకవేళ అలా అవ్వకపోతే ఇండస్ట్రీ వాళ్ళను పట్టించుకోదు.
కాబట్టి ప్రతి ఒక్కరూ ఇండస్ట్రీలో ఎక్కువ రోజులపాటు ఉండాలంటే ప్రతి రోజు వాళ్లు చాలా రకాలుగా కష్టాలు పడాల్సి ఉంటుంది.ఎప్పుడైతే మనం అప్డేట్ అవడం ఆపేస్తామో అప్పటినుంచి ఇండస్ట్రీ లో క్రమంగా మనకు అవకాశాలు తగ్గుతూ ఉంటాయి.
అయితే ఒకప్పుడు గుర్తింపు పొంది ప్రస్తుతం ఉన్న జనరేషన్ కి తగ్గట్టుగా అప్డేట్ అవ్వలేక ఫ్లాప్ సినిమాలు తీస్తున్న డైరెక్టర్లు ఎవరో ఒక్కసారి మనం తెలుసుకుందాం…
ముందుగా మనం కృష్ణవంశీ( Krishna Vamshi ) గురించి తెలుసుకుందాం ఒకప్పుడు ఈయన క్రియేటివ్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నాడు.అలాగే వరుసగా సినిమాలు తీస్తూ మంచి సక్సెస్ లు కూడా అందుకున్నాడు.
అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఇతను సినిమాలు చేస్తున్నప్పటికీ అవేవీ పెద్దగా వర్కౌట్ అవడం లేదు.ఒకప్పుడు నిన్నే పెళ్ళాడుతా, సింధూరం, ఖడ్గం, మురారి, చందమామ లాంటి మంచి సినిమాలను తీసిన కృష్ణవంశీ ఇప్పుడెందుకు ఫ్లాప్ సినిమాలు తీస్తున్నాడు అని చాలామంది ఆయన ఫ్యాన్స్ బాధపడుతున్నారు

అయితే దీనికి కారణం ఏంటంటే ప్రస్తుతం ఉన్న జనరేషన్ కి తగ్గట్టుగా కృష్ణవంశీ అప్డేట్ అవ్వడం లేదని తెలుస్తుంది…ఇక ఈ లిస్టులో ఉన్న మరో డైరెక్టర్ గుణశేఖర్( Director Gunasekhar ) ఈయన కూడా ఇంతకుముందు చూడాలని ఉంది,( Chudalani Undi ) ఒక్కడు( Okkadu ) లాంటి బ్లాక్ బాస్టర్ హిట్స్ ని తీశాడు.అయిన కూడా ప్రస్తుతం ఈయన చేస్తున్న సినిమాలు ఏవి కూడా ప్రేక్షకులను అలరించలేకపోతున్నాయి.దాంతో ఇలా చేసిన సినిమాలు వరుసగా ప్లాప్ అవుతున్నాయి

అయితే ఈయన కూడా ప్రస్తుత జనరేషన్ కి తగ్గట్టు గా సినిమాలు చేయడంలో విఫలం అవుతున్నాడు.దానికి కారణం ఈ జనరేషన్ కి తగ్గట్టు గా ఉండే సినిమాలు ఆయన తీయడం లేదు.అంటే ప్రేక్షకులు అలాంటి సినిమాలను అయితే కోరుకుంటున్నారో అలాంటి సినిమాలని ప్రజెంట్ చేయడం ఈయన ఫెయిలవుతున్నాడు…వీళ్ళిద్దరూ కూడా ఈ జనరేషన్ కి తగ్గట్టుగా మంచి కథలను రెడీ చేసుకుని మంచి సక్సెస్ లు కొట్టారని కోరుకుందాం…








