Jr Ntr Chandrababu Naidu : ఆ విషయంలో తెగించేసిన ఎన్టీఆర్.. అందుకే చంద్రబాబు విషయంలో స్పందించలేదంటూ?

చంద్రబాబు అరెస్ట్( Chandrababu arrest ) అయినప్పటి నుంచి ఏపీ రాజకీయాలలో అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీలో వినిపిస్తున్న ఒకే ఒక ప్రశ్న.చంద్రబాబు అరెస్ట్ పై జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించడం లేదు? ఈ ప్రశ్న ప్రతి ఒకరి మధ్యలో మెదులుతోంది.ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ స్పందించకపోవడానికి కారణాలు ఇవే అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే.తాజాగా కూడా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ స్పందించకపోవడానికి గల కారణాలు ఇవే అంటూ కొన్ని వార్తలు వరులు అవుతున్నాయి.

 Jr Ntr Rrr Fame Not Respond Even His Uncle Ex Cm Of Ap Chandrababu Naidu Arrest-TeluguStop.com

ఇటీవల టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్( Natty Kumar ) ఈ విషయంపై స్పందిస్తూ.చంద్రబాబు అరెస్ట్ విషయమై టాలీవుడ్‌లో పవన్ కళ్యాణ్, బాలయ్య, రాఘవేంద్ర రావు సహా ఇతరు సినీ పెద్దలు ఎవరు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.

Telugu Ap Chandra Babu, Harikrishna, Jr Ntr, Kalyan Ram, Lokesh, Natti Kumar, Pa

బాలయ్య అంటే స్వయంగా వియ్యంకుడు కమ్ బామ్మర్ది.పవన్ కళ్యాణ్ ముందు నుంచి జగన్‌తో అమీతుమీగా ఉన్నారు.ఇద్దరు రాజకీయ నాయకులు కాబట్టి వాళ్లు స్పందించారు.తెలుగు సినీ ఇండస్ట్రీలోని మిగతా హీరోలు, నిర్మాతలు చంద్రబాబు నుంచి ఎన్నో సహాయ, సహకారాలు పొందారు.ఆయన క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నపుడు ఏ సినీ పెద్దలు ఆయన అరెస్ట్‌‌‌ను ఎందుకు ఖండించలేదని చెబుతున్నారు.మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు భయపడే సినీ ఇండస్ట్రీ ప్రముఖులు చంద్రబాబు అరెస్ట్ విషయంలో సైలెంట్‌గా ఉన్నట్టు చెప్పుకొచ్చారు నట్టి కుమార్.

కానీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ సయమంలో ఇప్పటి వరకు ఎన్టీఆర్ స్పందించలేదు.ఇకపై స్పందిస్తారనేది కూడా నమ్మకం కూడా లేదు.

ఇప్పటికే తెలుగు దేశం పార్టీకి చెందిన క్యాడర్‌లోని కొంత మంది ఎన్టీఆర్ తీరుపై దుమ్మెత్తి పోస్తున్నారు.ఇక ఎన్టీఆర్ కూడా తన చివరి రక్తపు బొట్టు వరకు తెలుగు దేశం పార్టీతోనే ఉంటా అని ప్రకటనలు కూడా చేశారు.కానీ చంద్రబాబు అరెస్ట్ విషయమై ఎన్టీఆర్‌తో పాటు కళ్యాణ్ రామ్ కనీసం స్పందన వ్యక్తం చేయలేదు.2009 ఎన్నికల్లో ఎన్టీఆర్‌ను వాడుకొని ఆ తర్వాత తన కుమారుడు లోకేష్‌కు ఎక్కడ అడ్డు వస్తాడనే ఉద్దేశ్యంతో ఎన్టీఆర్‌( Jr ntr )ను పక్కన పెట్టేసారు.ఇక ఎన్టీఆర్ కూడా రాజకీయాలు పక్కన పెట్టి తన దృష్టిని పూర్తిగా సినిమాలపైనే ఫోకస్ పెట్టాడు.ఇక చంద్రబాబు క్లిష్ట సమయాల్లో ఎన్టీఆర్‌ను వాడుకుని ఒదిలేసాడనేది ఎన్టీఆర్ అభిమానుల వాదన.

మరోవైపు బాలయ్య కూడా అన్నయ్య కుమారుడు కాకుండా తన సొంత అల్లుడు లోకేష్ రాజకీయ భవిష్యత్తు కోసమే ఎన్టీఆర్‌ను పక్కన పెట్టినట్టు తెలుస్తోంది.

Telugu Ap Chandra Babu, Harikrishna, Jr Ntr, Kalyan Ram, Lokesh, Natti Kumar, Pa

ఇక చంద్రబాబుకు జనసేనాని పవన్ కళ్యాణ్( Pawan kalyan ) మద్దతు లభించడంలో ఎన్టీఆర్‌ను సాంతం పక్కన పెట్టేసారు.అంతకు ముందు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు కూడా జూనియర్‌‌ను ఏదో మొక్కుబడిగా పిలచారు.తన పుట్టినరోజునే తాత శత జయంతి వేడుకలు నిర్వహించడం అప్పటికే వేరే కమిట్‌మెంట్స్ ఉన్న కారణంగా ఎన్టీఆర్ ఆ కార్యక్రమానికి వెళ్లలేదు.

చంద్రబాబు అరెస్ట్ జరిగి దాదాపు ఐదు రోజులు దాటినా ఎన్టీఆర్ మాత్రం ఎవరెన్ని విమర్శలు చేసినా తన పని తాను చేసుకొని వెళుతున్నాడు.ఏపీలో ప్రస్తుతం నడుస్తోన్న రాజకీయ పరిస్థితులు తనకేమి పట్టనట్టే ఉన్నాడుఈ నేపథ్యంలో ఎన్టీఆర్ సైమా అవార్డుల్లో ఉత్తమ నటుడిగా ఎంపికైనందున దుబాయి పయనమై వెళ్లాడు.

మొత్తానికి ఎన్టీఆర్తీరు చూస్తుంటే అసలు రాజకీయాల గురించి చంద్రబాబు అరెస్ట్ విషయం గురించి స్పందించేలా కనిపించడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube