హీరో విశాల్( Vishal ) గురించి మనందరికీ తెలిసిందే.ఈయన నటించిన చాలా సినిమాలు తెలుగులో కూడా విడుదల అయ్యాయి.
తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా హీరో విశాల్ సుపరిచితమే.ఇది ఇలా ఉంటే విశాల్ తాజాగా నటించిన చిత్రం మార్క్ ఆంటోనీ( Mark Antony ).ఇందులో ఎస్ జె సూర్య విలన్ గా నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమాలో విశాల్, సూర్య ఇద్దరూ ద్విపాత్రాభినయం చేశారు.
ఈ మూవికి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించగా ఎస్.వినోద్ కుమార్( S.Vinod Kumar ) నిర్మించారు.కాగా ఈ మూవీ సెప్టెంబర్ 15న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.
విడుదల తేదీకి మరొక నాలుగు రోజులు మాత్రమే సమయము ఉండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది.ఇది ఇలా ఉండే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో విశాల్ మాట్లాడుతూ పలు షాకింగ్ కామెంట్స్ చేశారు.ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ… డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ ( Director Adhik Ravichandran )ఒక కథను నాకు దాదాపు తొమ్మిదేళ్ల కిందట చెప్పాడు.
ఒక నిర్మాత దగ్గరికెళ్తే ఇదసలు స్క్రిప్టేనా? అన్నాడు.అలా 40 మంది నిర్మాతలు బయటకు గెంటేశారు.
బాధతో మరో కథ రాసుకున్నాడు.త్రిష ఇల్లనా నయనతార అనే సినిమా తీశాడు.
అది బ్లాక్‌బస్టర్ హిట్.తర్వాత చేసిన ఒక సినిమా డిజాస్టర్ అయింది.
ఒకరోజు నాకు ఫోన్ చేసి అన్నయ్య, నేను సూసైడ్ చేసుకోబోతున్నాను.
అందులో నీ పేరు రాసి చచ్చిపోతాను అని ఫోన్ పెట్టేశాడు.వెంటనే నేను మళ్లీ ఫోన్ చేసి నా పేరెందుకు రాస్తా అంటున్నావురా? అని అడిగాను.నువ్వు డేట్స్ ఇవ్వకపోవడం వల్లే ఈ పరిస్థితిలో ఉన్నాను.
లేదంటే నేను ఇంకోలా ఉండేవాడిని అన్నాడు.అలా కాదురా, ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులో ఛాన్స్ వస్తుంది.
తప్పకుండా కలిసి చేద్దాం అని చెప్పాను.ఏడేళ్లుగా వెయిట్ చేశాడు.
ఇంతకాలానికి కలిసి మార్క్ ఆంటోని చేశాం.అధిక్ రవిచంద్రన్‌తో సినిమా చేస్తున్నాను అని చెప్పగానే చాలామంది నిర్మాతలు ఈ డైరెక్టర్‌తో ఎందుకు సర్? ఆయన సినిమాలు సరిగా ఆడలేదు, హిట్ ఇచ్చిన డైరెక్టర్‌తో వెళ్లవచ్చు కదా అని సూచించారు.నేను అతడి సినిమా ఎందుకు చేశాననేది సెప్టెంబర్ 15న మీ అందరికీ తెలుస్తుంది అని చెప్పుకొచ్చాడు విశాల్.ఈ సందర్భంగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో విశాల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.