అంత అదృష్టం లేదు... జెనీలియా ప్రెగ్నెన్సీ పై స్పందించిన రితేష్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి జెనీలియా( Genelia ) ప్రస్తుతం పెళ్లి చేసుకుని తన వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నారు.ఇక ఈమె ఇద్దరు పిల్లలకు తల్లి అనే విషయం మనకు తెలిసిందే.

 Riteish Deshmukh React On Genelia Pregnancy Rumours , Genelia, Riteish, Pregn-TeluguStop.com

ఇలా పెళ్లి తర్వాత పిల్లల ఆలనా పాలన చూసుకుంటూ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి జెనీలియా తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.ప్రస్తుతం పలు సినిమాలు వెబ్ సిరీస్( Web series ) లలో నటిస్తున్నటువంటి ఈమె కెరియర్ పరంగా బిజీ అయ్యారు.

అయితే తన భర్తతో కలిసి జెనీలియా ఒక ప్రైవేట్ ఈవెంట్లో పాల్గొన్నారు.

Telugu Bollywood, Genelia, Pregnancy, Riteish, Tollywood, Web-Movie

ఈ కార్యక్రమంలో భాగంగా తన భర్తతో కలిసి బ్లూ కలర్ డ్రెస్ ధరించి ఎంతో సందడి చేశారు.అయితే ఈ డ్రెస్ లో జెనీలియాని చూడగానే ఆమె గర్భవతా అన్న ఆలోచన అందరిలోనూ వచ్చింది.ఇప్పటికే ఇద్దరు పిల్లలకు తల్లిగా ఉన్నటువంటి జెనీలియా మూడోసారి కూడా తల్లి కాబోతుందా అంటూ పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తం చేయడమే కాకుండా ఈ వార్తలను వైరల్ చేశారు.

ఇక ఈ ఫోటోలలో జెనీలియా బేబీ బంప్ ( Baby Bump ) క్లియర్ గా కనిపించడంతో జెనీలియా మూడోసారి తల్లి కాబోతుంది అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే ఈ వార్తలు జెనీలియా భర్త రితేష్ దేశ్ముఖ్ (Riteish Deshmukh) కంటపడ్డాయి.

Telugu Bollywood, Genelia, Pregnancy, Riteish, Tollywood, Web-Movie

ఈ విధంగా తన భార్య మూడోసారి తల్లి కాబోతుంది అంటూ వస్తున్నటువంటి వార్తలపై రితేష్ స్పందించారు.ఈ సందర్భంగా ఆయన ఈ వార్తలకు సంబంధించిన స్క్రీన్ షాట్లను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ నాకు కూడా మరో ఇద్దరు ముగ్గురు పిల్లలు కావాలని ఉంది కానీ దురదృష్టవశాత్తు ఈ వార్తలలో నిజం లేదు అంటూ ఆయన జెనీలియా ప్రెగ్నెన్సీ గురించి స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో జెనీలియా ప్రెగ్నెన్సీ గురించి వస్తున్నటువంటి వార్తలకు చెక్ పెట్టినట్లు అయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube