నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం భగవంత్ కేసరి సినిమా( Bhagavanth kesari movie )లో నటిస్తున్న విషయం తెల్సిందే.ఆ సినిమా లో శ్రీలీల ముఖ్య పాత్రలో కనిపించబోతుంది.
హీరోయిన్ గా కాజల్ అగర్వాల్( Kajal Aggarwal ) నటిస్తున్న ఈ సినిమాలో బాలయ్య కూతురు గా శ్రీలీల కనిపించబోతుంది అంటూ మొదటి నుండి కూడా వార్తలు వస్తున్నాయి.ఇప్పటి వరకు భగవంత్ కేసరి సినిమా లో బాలయ్య కూతురుగా శ్రీలీల నటిస్తుంది అంటూనే వార్తలు వస్తున్నాయి.
![Telugu Anil Ravipudi, Arjun Rampal, Balakrishna, Kajal Aggarwal, Sreeleela, Toll Telugu Anil Ravipudi, Arjun Rampal, Balakrishna, Kajal Aggarwal, Sreeleela, Toll](https://telugustop.com/wp-content/uploads/2023/09/bhagavanth-kesari-movie-balakrishna-sreeleela-tollywood-Anil-Ravipudi-Kajal-Aggarwal.jpg)
కానీ తాజాగా ఆ విషయమై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజం కాదని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.ఇప్పటి వరకు అధికారికంగా సినిమా గురించి ఎలాంటి క్లారిటీ రాలేదు.బాలయ్య మరియు శ్రీలీల( Sreeleela ) కాంబోలో ఒక పాట రిలీజ్ అయింది.ఆ పాట కచ్చితంగా సినిమాకు ప్రధాన ఆకర్షణగా అన్నట్లుగా ఉంటుంది అంటూ యూనిట్ సభ్యులు చెబుతున్నారు.ఆకట్టుకునే అందంతో పాటు మంచి డాన్సర్ అయిన శ్రీలీలను బాలయ్య పక్కన చూసి చాలా మంది ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
బాలయ్య కూతురుగా శ్రీ లీల నటిస్తే బాగుంటుందని అంతా భావించారు.
![Telugu Anil Ravipudi, Arjun Rampal, Balakrishna, Kajal Aggarwal, Sreeleela, Toll Telugu Anil Ravipudi, Arjun Rampal, Balakrishna, Kajal Aggarwal, Sreeleela, Toll](https://telugustop.com/wp-content/uploads/2023/09/balakrishna-sreeleela-tollywood-Anil-Ravipudi-Kajal-Aggarwal.jpg)
కానీ ఇప్పుడు సినిమా లో ఆమె కూతురు కాదు అనే విషయం తెలిసి చాలా మంది షాక్ అవుతున్నారు.ఇంతకు బాలయ్య కి శ్రీలీల సినిమా లో ఏమవుతుంది అనేది తెలియాలి అంటే సినిమా విడుదల అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.అసలు విషయం ఏంటి అంటే దర్శకుడు అనిల్ రావిపూడి( Anil Ravipudi ) కథ ను రెడీ చేసుకున్న సమయంలో హీరో కి కూతురు పాత్ర గానే అనుకున్నా కూడా బాలయ్య తనకు కూతురు పాత్రలో ఆమె ను చూపిస్తే తర్వాత సినిమాల పరిస్థితి ఏంటి అంటూ ప్రశ్నించాడట.
అందుకే అనిల్ రావిపూడి కథను మార్చి రాశాడు.బాలయ్య, శ్రీలీల మధ్య సన్నిహిత్యం ఉంటుంది కానీ అది తండ్రి కూతురు బంధం కాదని సమాచారం అందుతోంది.