Vijay Devarakonda: ఆ డైలాగ్ ఉంటే విజయ్ దేవరకొండ సినిమా హిట్టేనా.. విజయ్ సినిమాలలో ఈ విషయాన్ని గమనించారా?

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం ఖుషి.

 If Devarakonda Brothers Donlike That Then Movie Will Be Hit-TeluguStop.com

( Kushi Movie ) ఇందులో సమంత హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది.

శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమా లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే.అయితే దర్శకుడు సినిమాను పూర్తిగా యూత్ ను టార్గెట్ చేసి రూపొందించినట్లు తెలుస్తోంది.

లైగర్ సినిమాతో( Liger ) కెరీర్లోనే భారీ ఫ్లాపును మూట గట్టుకున్న విజయ్ దేవరకొండకు, చేసిన సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టడంతో సక్సెస్ కోసం అర్రలు చాచిన సమంతకు ( Samantha ) ఈ సినిమా హిట్ ఒక బూస్ట్ మాదిరిగా పని చేస్తుందనడంలో సందేహం లేదు.వారిద్దరికే కాకుండా డైరెక్టర్ శివ నిర్వాణకు ఈ సినిమా మంచి కిక్కు నిచ్చింది.

ఈ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా చిత్ర బృందం సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.సోషల్ మీడియాలో కూడా తనదైన స్టైల్‎లో అందరినీ ఆకట్టుకుంటున్నాడు విజయ్ దేవరకొండ.

తాజాగా విజయ్ ఖుషిలోని తన డైలాగ్‎ను ఉద్దేశిస్తూ ఒక ఆసక్తికర పోస్టు చేశాడు.

ఆ పోస్ట్‎కు తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ( Anand Devarakonda ) రిప్లై ఇచ్చాడు.సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో నటీనటులు కొన్ని సెంటిమెంట్స్ ఎక్కువగా ఫాలో అవుతుంటారు.ఆ హీరోయిన్ తో చేస్తే సినిమా హిట్ అవుతుంది.

ఆ డైరెక్టర్ తో చేస్తే బాగుంటుంది అని మరి కొందరైతే ఆ ముహూర్తం రోజే సినిమాను స్టార్ట్ చేయాలని పలానా రోజే ఈ సినిమా రిలీజ్ చేయాలని సెంటిమెంట్స్ కు ప్రాధాన్యం ఇస్తుంటారు.అలాగే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఒక క్రేజీ సెంటిమెంట్ వైరల్ అవుతోంది.

అదే విజయ్ దేవరకొండ మార్క్ డైలాగ్ విజయ్ ఏ ముహూర్తాన అర్జున్ రెడ్డి( Arjun Reddy ) సినిమాలో ఆ పిల్ల నాది అంటూ డైలాగ్ చెప్పాడో ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

అదే విధంగా బేబీ సినిమాలో( Baby Movie ) ఆనంద్ దేవరకొండ కూడా ఆ పిల్ల నాదిరా అనే డైలాగ్ వాడాడు.అందరికీ తెలిసిందే ఆ సినిమా ఎంతటి సక్సెస్ అయ్యిందో.ఆ తర్వాత విజయ్ దేవరకొండ ఖుషి సినిమాలో కూడా ఈ డైలాగ్ ను వాడారు.

ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వడం ఖాయం అంటూ నెట్టింట్లో ఈ వార్త హల్ చల్ చేస్తోంది.అంతేకాదు దేవరకొండ బ్రదర్స్ కి ఈ డైలాగ్ బాగా అచ్చి వచ్చిందని ఆ పిల్ల నాది అనే డైలాగ్ ఉంటే సినిమా సూపర్ హిట్ అవుతుంది అంటూ విజయ్ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube