తెలంగాణలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు.రాష్ట్రంలో అర్హులు కాకపోయినా బీఆర్ఎస్ నేతలకు మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించారని ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు.రాష్ట్రాన్ని మత్తు తెలంగాణగా మార్చారని తీవ్ర ఆరోపణలు చేశారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు గుడ్ బై చెబుతారని, బీజేపీనే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.