సాధారణంగా ఏ పార్టీ వ్యూహరచన ఆ పార్టీకీ సంబంధించిన వారే చేయడం సర్వసాధారణం.కానీ ఒక పార్టీకి చెందిన వారు వేరే పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నారంటే వారు పొత్తులో ఉన్నారని అర్థం.
కానీ పొత్తులో లేకుండా.ఒక పార్టీతో సంబంధం లేకుండా ఇతర పార్టీ వ్యూహాలను డిసైడ్ చేయగలరా ? అంటే చేయగలని వైసీపీ( YCP ) నేతలు చెబుతున్నారు.ఇంతకీ విషయమేమిటంటే.టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ).బీజేపీలో కీ రోల్ పోషిస్తున్నారని ఆ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.అసలు టీడీపీ బీజేపీ మద్య పొత్తుకు సంబంధించి ఎలాంటి క్లారిటీ లేదు.
అయినప్పటికి ఆ రెండు పార్టీలు కలిసి పని చేస్తున్నాయనేది వారు చెబుతున్నా మాట.ఇటీవల ఏపీ బీజేపీ అద్యక్షురాలు పురందేశ్వరి చంద్రబాబుతో భేటీ అయిన సంగతి తెలిసిందే.
![Telugu Ap, Chandrababu-Politics Telugu Ap, Chandrababu-Politics](https://telugustop.com/wp-content/uploads/2023/09/Chandrababus-key-role-in-BJP-Is-it-trueb.jpg)
ఈ భేటీ కుటుంబ పరంగా జరిగిన సమావేశం అని పురందేశ్వరి( Purandeshwari ) చెబుతోంది.కానీ ఇందులో ఏదో రాజకీయం ఉండే ఉంటుందని వైసీపీ చెబుతోంది.ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యాయి.పార్టీలు వేరైనా బీజేపీలో ఎవరు ఉండాలో ఆయనే నిర్ణయిస్తారని, సోము వీర్రాజు తప్పా అందరూ ఆయన కోరుకున్నవారే అధ్యక్షులయ్యారని, అందుకే కాపు సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజు ను తప్పించి ఆయన వదిన పురదేశ్వరికి ఆ పదవి దక్కేలా చేశారని, కేంద్ర ప్రభుత్వం పొత్తుకు అంగీకరించకపోయినప్పటికి అభ్యర్థులను మాత్రం ఆయనే డిసైడ్ చేస్తారని ” చంద్రబాబు నాయుడును ఉద్దేశించి విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో రాసుకొచ్చిన వ్యాఖ్యలవి.
![Telugu Ap, Chandrababu-Politics Telugu Ap, Chandrababu-Politics](https://telugustop.com/wp-content/uploads/2023/09/Chandrababus-key-role-in-BJP-Is-it-truec.jpg)
ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఏపీ బీజేపీ డైరెక్షన్ అంతా చంద్రభాబు చేతిలోనే ఉన్నట్లు వైసీపీ చెబుతోంది.కాగా గత ఎన్నికల టైమ్ బీజేపీ( BJP ) టీడీపీ మద్య తీవ్ర స్థాయిలో విభేదాలు చెలరేగిన సంగతి తెలిసిందే.కానీ మళ్ళీ ఇప్పుడు బీజేపీతో కలిసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.కానీ బీజేపీ మాత్రం టీడీపీతో కలవడంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.అయితే ప్రస్తుతం విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే టీడీపీ బీజేపీకి మద్య మొదటి నుంచి ఇంటర్నల్ కనెక్షన్ ఉందనేది తెరపైకి వస్తోంది.అయితే టీడీపీ, బీజేపీలను డిఫెన్స్ లో పడేసేందుకే వైసీపీ ఈ రకమైన ఆరోపణలను తెరపైకి తెస్తోందనేది కొందరి అభిప్రాయం.