వన్ నేషన్- వన్ ఎలక్షన్ పై కేంద్రం వేగంగా అడుగులు వేస్తుంది.ఈ అంశంపై సాధ్యాసాధ్యాల పరిశీలనకు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీని కేంద్రం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో బీజేపీ అగ్రనేత జేపీ నడ్డా కీలక భేటీ అయ్యారు.దాదాపు అరగంటపాటు ఈ సమావేశం కొనసాగగా జేపీ నడ్డా రామ్ నాథ్ కోవింద్ కు ఓ పుస్తకాన్ని అందించారు.
అయితే వీరిద్దరి భేటీ ప్రస్తుతం దేశ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.కాగా దేశ వ్యాప్తంగా లోక్ సభ మరియు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలనే యోచనలో ఉన్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గత కొన్నేళ్లుగా జమిలి ఎన్నికల కోసం బలంగానే ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే.
దీన్ని అమల్లోకి తెచ్చే విధంగానే ప్రస్తుతం కార్యాచరణ మొదలుపెట్టిందని సమాచారం.







