టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో పూరి జగన్నాథ్ ( Puri Jagannadh )గురించి పరిచయం అవసరం లేదు.డైరెక్టర్ గా ఈయన డైరెక్షన్లో వచ్చిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.
ఇలా దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి పూరి వ్యక్తిగత విషయానికి వస్తే ఈయన లావణ్య( Lavanya )అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.అయితే గతంలో ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తమ ప్రేమ గురించి లావణ్య అన్ని విషయాలు తెలిపారు.
అయితే తాజాగా వీరి లవ్ స్టోరీ(Love Story)గురించి మరో ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పూరి జగన్నాథ్ సినిమాలకు డైరెక్టర్ కాకముందు ఈయన సీరియల్ డైరెక్టర్ గా పని చేసేవారట ఈ క్రమంలోనే ఒక సీరియల్ డైరెక్షన్ కోసం రామంతపూర్ వెళ్ళాడట.అక్కడ ఒక ఇంటి ప్రాంగణం( Oka Inti Pranganam Serial )లో సీరియల్ షూటింగ్ చేస్తుండగా అక్కడే మొదటిసారి లావణ్యను చూశారట ఆమెను చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే ఫీలింగ్ కలిగిందని పెళ్లి చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకోవాలని కూడా డిసైడ్ అయ్యారట.దాంతో తన అసిస్టెంట్ ని పిలిచి పూరి తన విసిటింగ్ కార్డు ఇచ్చి ఆ అమ్మాయి నాకు నచ్చింది తననే పెళ్లి చేసుకుంటాను తనుకు నచ్చితే విజిటింగ్ కార్డు వెనుక తన ఫోన్ నెంబర్ రాసి పంపించమని చెప్పారట.

ఇలా అసిస్టెంట్ వెళ్లి చెప్పేసరికి భయపడినటువంటి లావణ్య తిరిగి విసిటింగ్ కార్డు వెనక్కి పంపించింది మరోసారి కూడా అలాగే పంపించింది.అయినప్పటికీ తను ఒప్పుకోకపోవడంతో మూడు రోజుల తర్వాత అదే అసిస్టెంట్ ని పిలుచుకొని లావణ్య ఇంటికి వెళ్లారు అయితే ఆమె తన ఫోన్ నెంబర్ రాసి పంపించింది.ఈ విధంగా పూరి జగన్నాథ్( Puri Jagannadh Love Story) తనకు ఫోన్ చేసే ఐదు నిమిషాలు మాట్లాడాలని చెప్పి దాదాపు గంటన్నర పాటు మాట్లాడారట.ఇక తన ఇంటి అడ్రస్ ఇచ్చినటువంటి పూరీ జగన్నాథ్ నా గురించి ఏదైనా చెప్పాలి అంటే ఈ అడ్రస్ కి పంపించు అంటూ చెప్పారట పూరి జగన్నాథ్ ఇలా చెప్పడంతో తన ప్రేమకు ఫిదా అయినటువంటి లావణ్య అతని ప్రేమలో పడిపోయి చివరికి పెళ్లి చేసుకున్నారంటూ తమ ప్రేమ విషయాలను తెలిపారు.







