అమరావతి:నేడు కౌలు రైతులకు రైతు భరోసా నగదు విడుదల.సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి అర్హులైన రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయనున్న సీఎం వైఎస్ జగన్.
కౌలు రైతులతో పాటు దేవాదాయ భూమి సాగుదారులకు కూడా అందనున్న సాయం.కౌలు రైతులకు “వైఎస్సార్ రైతు భరోసా’.రాష్ట్రవ్యాప్తంగా పంట సాగుదారు హక్కు పత్రాలు (సీసీఆర్సీలు) పొందినవారిలో అర్హులైన 1,46,324 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలు రైతులు, దేవాదాయ భూముల సాగుదారులకు తొలి విడతగా రూ.7,500 చొప్పున వరుసగా ఐదో ఏడాది వైఎస్సార్ రైతు భరోసా సాయంగా రూ.109.74 కోట్లు.
పంట నష్టపోయిన 11,373 మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీగా రూ.11.01 కోట్లతో కలిపి మొత్తం రూ.120.75 కోట్ల ఆర్థిక సాయాన్ని నేడే బటన్ నొక్కినేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్న ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి.ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్ ముగిసేలోగానే పరిహారం అందిస్తున్న ప్రభుత్వం.నేడు జమ చేస్తున్న లబ్ధితో కలిపి వైఎస్సార్ రైతు భరోసా-PM KISAN ద్వారా సొంత భూమి సాగు చేసుకుంటున్న అర్హులైన రైతన్నలతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలు రైతులు, RoFR (అటవీ), దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న మొత్తం 52,57,263 మంది రైతన్నలకు కేవలం ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రూ.3,943 కోట్లను అందించిన జగన్ ప్రభుత్వం.ఈ 50 నెలల్లో వైఎస్సార్ రైతు భరోసా -PM KISAN ద్వారా అందించిన సాయం రూ.31,005 కోట్లు..
2023 మే – ఆగష్టు వరకు సంభవించిన అకాల వర్షాలు, వరదల వల్ల పంట నష్టపోయిన 11,373 మంది రైతన్నలకు రూ.11,01,54,077 ఇన్పుట్ సబ్సిడీ సాయం కూడా నేడు వారి ఖాతాల్లో జమ.ఇటీవల గోదావరి వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు తక్షణ సాయం కింద ఇప్పటికే రూ.38 కోట్లు అందించిన జగన్ ప్రభుత్వం…రైతన్నలకు ఏటా 3 విడతల్లో రూ.13,500.ఖరీఫ్ పంట వేసే సమయంలో రూ.7,500.ఖరీఫ్ పంట కోత సమయంలో మరియు రబీ అవసరాల కోసం రూ.4,000, పంట ఇంటికి వచ్చే సమయాన, జనవరి/ఫిబ్రవరి నెలలో రూ.2,000.







