ప్రముఖ యూట్యూబర్ కమెడియన్ వైవా హర్ష ( Viva Harsha )గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ ల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వైవా హర్ష సినిమాలలో కూడా నటిస్తూ సందడి చేస్తున్నారు.
అయితే తాజాగా వైవాహర్ష నూతన గృహప్రవేశం చేసినట్టు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈయన గృహప్రవేశానికి సంబంధించినటువంటి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ గృహప్రవేశ ( House Warming )కార్యక్రమానికి సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ ( Saidharam Tej ) హాజరు కావడం విశేషం ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్ వైరల్ గా మారడంతో ఎంతో మంది అభిమానులు వైవా హర్షకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

వైవా హర్ష యూట్యూబ్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.సంవత్సరాల క్రితం వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే.కరోనా సమయంలో అతి కొద్ది సమక్షంలో ఈయన తన పెళ్లి వేడుకలను చాలా ఘనంగా జరుపుకున్నారు.
ఇక పెళ్లి తర్వాత ఆయన వేసిన ట్రిప్పులు, తన భార్య మీద ఉన్న ప్రేమను చూపిస్తూ చేసిన పోస్టులు అందర్నీ ఆకట్టుకున్నాయి.ఇక ఈయన కెరియర్ విషయానికి వస్తే యూట్యూబ్ వీడియోలు మాత్రమే కాకుండా సినిమాలలో కూడా నటిస్తూ సందడి చేశారు.

తాజాగా చిరంజీవి నటించిన భోళా శంకర్ ( Bhola Shankar )సినిమాలో నటించినటువంటి ఈయన ప్రస్తుతం సోలో హీరోగా సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.హర్ష నటించిన ఇప్పటికే కలర్ ఫోటో బేబీ సినిమాలలో హర్ష నటన అందరిని అలరించింది.ఇక ఈయనకు మెగా హీరో సాయి ధరంతేజ్ ఎంతో మంచి స్నేహితుడని తెలుస్తుంది.ఇలా వీరి మధ్య ఉన్నటువంటి స్నేహబంధం కారణంగానే సాయి ధరంతేజ్ హర్ష గృహప్రవేశ కార్యక్రమాలలో పాల్గొని సందడి చేశారు.
హర్ష స్వయానా చిరంజీవి స్నేహితుడు కొడుకు అనే విషయాన్ని భోళా శంకర్ సినిమా వేడుకలలో బయటపెట్టారు.







