సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు జైలుకు వెళ్లి వచ్చారన్న విషయం చాలా మందికి తెలియదు.మరి టాలీవుడ్, బాలీవుడ్( Tollywood, Bollywood ) లో ఏ హీరోలు ఏ కారణాలతో జైలుకు వెళ్లి వచ్చారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
టాలీవుడ్ హీరో సుమన్( Suman ) కెరీర్ పీక్స్‌లోఉన్న సమయంలో జైలుకు వెళ్లాల్సి వచ్చింది.ఈయనతో పాటు పలువురు ప్రముఖ హీరోలు జైలు జీవితం గడిపారు.
అయితే టాలీవుడ్ లో జైలు జీవితం గడిపిన హీరో ఒక సుమన్ కావడం బాధాకరమైన విషయం.కానీ బాలీవుడ్ లో మాత్రం ఈ సంఖ్య ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు.
దలేర్ మెహందీ( Daler Mehndi ).మానవ అక్రమ రవాణ కేసులో పాటియాలా కోర్టు ఇది వరకే రెండేళ్ల జైలు శిక్ష విధించింది.ఆ తర్వాత దలేర్ మెహందీ బెయిల్ పై విడుదలయ్యారు.రీసెంట్‌గా పాటియాల కోర్టు ఆ శిక్షను ఖరారు చేస్తూ తీర్పు ఇవ్వడంతో పంజాబ్ పోలీసులు దలేర్ మెహందీని అదుపులోకి తీసుకున్నారు.
బాలీవుడ్ బాద్‌షా తనయుడు ఆర్యన్ ఖాన్( Aryan Khan ) కొన్ని రోజులు ఆర్ధర్ రోడ్ జైల్లో గడిపారు.ఈయన ముంబైలోని క్రూయిజ్ షిప్‌లో డ్రగ్స్ వాడుతూ దొరికాడంటూ పోలీసులు అతనిపై అభియోగాలు మోపారు.
కానీ ఈ కేసులో ఆర్యన్ ఖాన్ నిర్ధోషి అంటూ కోర్టు కేసు కొట్టేసింది.

బాలీవుడ్‌లో ప్రస్తుతం రాజ్ కుంద్రా( Raj Kundra ) వ్యవహారం సంచలనంగా మారింది.ఆయన్ని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ఎవరెవరి పేర్లు బయటికి వస్తాయా అని అంతా వణికిపోతున్నారు.ముంబైలో పోర్నోగ్రఫీ రాకెట్ ఇంతగా పెరిగిపోయిందా ఈ స్థాయిలో పాకిపోయిందా అంటూ అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.
మొత్తంగా ఈ కేసు పుణ్యామా అంటూ రాజ్ కుంద్రా జైల్లో చిప్పకూడు తినాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈయన దాదాపు 60 రోజులు వరకు జైల్లో ఉండాల్సి వచ్చింది.
అలాగే 1998లో కృష్ణ జింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు జోధ్‌పూర్ కోర్ట్ ఐదేళ్ల శిక్ష విధించింది.ఈ కేసులో సల్మాన్ ఖాన్( Salman Khan ) 18 రోజుల పాటు జైలు జీవితాన్ని గడిపారు.

బాలీవుడ్ ఖల్ నాయక్ సంజయ్ దత్( Sanjay Dutt ) 1993లో ముంబై బాంబ్ పేలుళ్లతో పాటు అక్రమాయుధాలు కలిగియున్న కేసులో జైలు శిక్ష అనుభవించారు.బాంబే కోర్టు ఆరేళ్లు జైలు శిక్ష విధించింది.సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో రియా చక్రబర్తిని ముంబైలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్ట్ చేసింది.ఈ కేసులో రియా చక్రబర్తి ( Rhea Chakraborty )ముంబైలోని బైకుల్ల జైల్లో గడిపింది.
ఒక మ్యాగజైన్ కవర్ పేజ్ వివాదంలో ఒక మతాన్ని కించపరిచిన కారణంగా జైలు కెళ్లిన సోనాలి బింద్రే.రాష్ డ్రైవింగ్ కారణంగా 15 రోజులు జైలుశిక్ష అనుభవించారు జాన్ అబ్రహం.
లాక్మే ఫ్యాషన్ వీక్‌లో అందరి ముందు అసభ్యంగా ప్రవర్తించిన కారణంగా జైలు పాలైన అక్షయ్ కుమార్ ఆ తర్వాత బెయిల్ దొరకడంతో ఇమిడియేట్‌గా విడుదలయ్యారు.అక్రమ పాస్‌పొర్ట్ కారణంగా ప్రియుడు అబూ సలేంతో కలిసి జైలుకెళ్లిన మోనికా బేడి.
ఈమె దాదాపు 5యేళ్లు జైలు జీవితం గడిపింది.







