టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని నెలల క్రితం వరకు హీరోయిన్ పూజా హెగ్డే( Pooja Hegde )ను మాత్రమే ఐరన్ లెగ్ అని పిలిచేవారు.పూజా హెగ్డే నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంటూ ఉండటంతో ఈ కామెంట్లు వినిపించాయి.
అయితే ప్రస్తుతం ఈ జాబితాలో హీరోయిన్ సాక్షి వైద్య ( Sakshi Vaidya )కూడా చేరింది.ఈ నటి నటిస్తే సినిమా రిజల్ట్ దారుణంగా ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఏజెంట్, ( Agent )గాండీవధారి అర్జున సినిమాలలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటించగా ఈ రెండు సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి ఫ్లాప్ గా నిలిచి నిర్మాతలను నిలువునా ముంచేశాయి.ఏజెంట్ ఫుల్ రన్ లో 5 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించలేదు.గాండీవధారి అర్జున ఫస్ట్ డే కలెక్షన్లు కోటి రూపాయల కంటే తక్కువ మొత్తంగా ఉండటం గమనార్హం.ఈ రెండు సినిమాలు ఒకే తరహా కథాంశంతో తెరకెక్కాయి.
పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) సినిమాలో సాక్షి వైద్య ఒక హీరోయిన్ గా నటిస్తుందని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారం నిజం కాకపోతే బాగుంటుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.సాక్షి వైద్య మరీ అద్భుతమైన నటి కూడా కాదని ఆమెను ఎంపిక చేయవద్దని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
చిన్న వయస్సులోనే కెరీర్ ను మొదలుపెట్టిన సాక్షివైద్య కెరీర్ ఏ విధంగా ఉండనుందో చూడాల్సి ఉంది.

సాక్షి వైద్యకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం పెరుగుతోంది.సాక్షి వైద్య పారితోషికం తక్కువగా ఉండటంతో కొత్త ఆఫర్లు ఇవ్వడానికి ఆసక్తి చూపుతారేమో చూడాలి.కథల ఎంపికలో సాక్షి వైద్య జాగ్రత్తలు తీసుకోవాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
వరుసగా సినిమాలు ఫ్లాపవుతున్నా సాక్షి వైద్యకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.సాక్షి వైద్య తెలుగు సినిమాలతో రాబోయే రోజుల్లో గోల్డెన్ లెగ్ ఇమేజ్ ను సొంతం చేసుకుంటారేమో చూడాలి.







