ఇటీవల జరిగిన 69వ జాతీయ అవార్డుల కార్యక్రమంలో జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ( Allu Arjun )ఎంపిక చేసిన విషయం తెలిసిందే.ఇప్పటివరకు ఏ తెలుగు హీరో సాధించని ఘనతను అల్లు అర్జున్ సాధించారు.2021 లో విడుదలైన పుష్ప సినిమాకు గాను ఈ అవార్డుని అందుకున్నారు.అయితే ఈ అవార్డుని అందుకున్నారని సంతోషించాలో సోషల్ మీడియాలో కాంట్రవర్సీలు, ట్రోల్స్ ఎక్కువ అయ్యాయని బాధపడాలో అర్థం కావడం లేదు అంటున్నారు అభిమానులు.
అల్లు అర్జున్ కి ఈ అవార్డు రావడం పట్ల చాలామంది కుళ్ళు బుద్ధితో అనేక రకాల కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.

అలా తనకు కూడా అవార్డు రానందుకు బాలీవుడ్ నటుడు కలత చెందాడా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి.అంతేకాకుండా ఆయన చేసిన ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.జాతీయ చల్లని చిత్ర అవార్డులు ది కశ్మీర్ ఫైల్స్ చిత్రానికి కూడా వచ్చిన విషయం తెలిసిందే.
ఈ మూవీ రెండు అవార్డులను సొంతం చేసుకుంది.అయితే విజేతలను ప్రకటించిన కొన్ని గంటల తర్వాత ది కాశ్మీర్ ఫైల్స్( The Kashmir Files ) లీడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ విజయంపై తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
కానీ, ఈ సినిమాకు కూడా ఉత్తమ నటుడి అవార్డు వచ్చి ఉంటే బాగుండేదని అన్నారు.

దాంతో నెటిజన్స్ బన్నీకు బెస్ట్ యాక్టర్ అవార్డు రావడంతో అనుపమ్ ఖేర్( Anupam Kher ) తీవ్ర అసంతృప్తికి గురైనట్లు కామెంట్స్ చేస్తున్నారు.ఆయన చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.కాగా అనుపమ్ ఖేర్ ట్వీట్ లో ఈ విధంగా రాసుకొచ్చారు.
ది కాశ్మీర్ ఫైల్స్ జాతీయ అవార్డును గెలుచుకోవడం చాలా ఆనందంగా ఉంది.ఇది గర్వించదగిన విషయం.
ఈ చిత్రం జాతీయ సమగ్రతపై ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌గా నర్గీస్ దత్ అవార్డును అందుకుంది.నటుడిగానే కాకుండా ఎగ్జిక్యూటివ్‌గా కూడా ఈ చిత్ర నిర్మాతకు వచ్చిన గుర్తింపు పట్ల నేను సంతోషం వ్యక్తం చేస్తున్నాను.
అంటూ రాసుకొచ్చారు.ఇక కాశ్మీర్ ఫైల్స్ చిత్రంలో తన నటనకు కూడా అవార్డు వచ్చి ఉంటే తాను మరింత సంతోషించే వాడినని వెల్లడించారు.







