ఇస్రో చంద్రయాన్ 3 ప్రాజెక్ట్( Chandrayaan 3 ) సక్సెస్ కావడంతో ప్రపంచ దేశాలు భారత్ గురించి మరోసారి మాట్లాడుకుంటున్నాయి.అయితే ఈ ప్రాజెక్ట్ సక్సెస్ లో కీలక పాత్ర పోషించిన వాళ్లలో గుంటూరుకు చెందిన బొల్లు మానస( Bollu Manasa ) కూడా ఒకరు.
విక్రమ్ ల్యాండర్ ఎలాంటి ఆటంకాలు లేకుండా జాబిల్లిపై ల్యాండ్ కావడం కోసం ఇస్రో రూపొందించిన సాఫ్ట్ వేర్ టెస్టింగ్ లోని కీలక శాస్త్రవేత్తల బృందంలో బొల్లు మానస కూడా ఒకరు.
బొల్లు మానస స్వస్థలం అమృతలూరు కాగా ఆమె కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం ఐ.ఎస్.టీ కాలేజ్ లో ఏవియానిక్స్( Avionics ) చదివారు.తల్లీదండ్రుల నుంచి ప్రోత్సాహం లభించడంతో సైంటిస్ట్ గా( Scientist ) ఎదిగి మన దేశానికి సేవ చేయాలని భావించిన మానస ఎంతో కష్టపడి తన కలను నెరవేర్చుకున్నారు.చదువు పూర్తైన వెంటనే తన టాలెంట్ తో బెంగళూరు ఇస్రో శాటిలైట్ కేంద్రంలో ఆమె జాబ్ లో చేరారు.

చంద్రయాన్ 2 ప్రాజెక్ట్ కోసం కూడా మానస పని చేశారు.మానస భర్త పవన్ బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు.చంద్రయాన్2 లో జరిగిన తప్పులు రిపీట్ కాకుండా సిమ్యులేషన్స్ చేశామని ఆమె తెలిపారు.నాలుగేళ్ల కష్టం ఫలించడంతో సంతోషంగా ఉందని మానస వెల్లడించడం గమనార్హం.
శాస్త్రవేత్తల ఉమ్మడి కృషి వల్లే చంద్రయాన్ 3 సక్సెస్ అయిందని ఆమె అన్నారు.

మోదీ, దేశ ప్రజలు మాపై ఏ నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని మానస కామెంట్లు చేశారు.ఈ సక్సెస్ చంద్రునిపై( Moon ) మానవ సహిత యాత్రకు దోహదపడుతుందని ఆమె అన్నారు.ఇప్పటివరకు చంద్రుడి దక్షిణ ధ్రువంపై( South Pole ) ఏ దేశం ల్యాండర్ దిగలేదని మానస చెప్పుకొచ్చారు.
ఈ ఘనత సాధించిన తొలి దేశం భారత్ అని ఇందులో నా పాత్ర ఉండటంతో సంతోషంగా ఉందని ఆమె అన్నారు.







