మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ఆగస్టు 22వ తేదీన 67వ పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు ఇలా అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున చిరంజీవి పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు.ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి అభిమానిగా ఇండస్ట్రీలో కొనసాగుతూ నిర్మాతగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ప్రొడ్యూసర్ ఎస్కేఎన్( SKN ).
తాజాగా ఈయన బేబీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చే సంచలనమైన విజయం అందుకున్నారు.మెగా ఫ్యామిలీ అంటే ఎంతో అభిమానం అనే సంగతి మనకు తెలిసిందే.
ఈ క్రమంలోని చిరంజీవి పుట్టిన రోజు వేడుకలలో భాగంగా ఈయన చిరంజీవి అభిమానిగా మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి గురించి గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నెగెటివిటీ వస్తుంది.మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్( Meher Ramesh ) కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం భోళా శంకర్( Bhola Shankar ).ఈ సినిమాలోని ఈ విమర్శల గురించి ఎస్కేయన్ మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమా గురించి నెగిటివిటీ రావడానికి మెగా అభిమానులు కూడా ఒక కారణమని ఈయన తెలియజేశారు.చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ సినిమాలో కనిపించినంత స్టైలిష్ గా ఏ సినిమాలో కూడా కనిపించలేదు.దానిని కూడా మనం నిలబెట్టుకోలేక పోయాం ఎందుకంటే అందుకు అభిమానులు కూడా కారణమే అని తెలిపారు.

చిరంజీవి సినిమాల గురించి ఎవడో ఏదో చెబితే మనం వారి మాయలో పడుతున్నాము.కొందరు చిరంజీవి గారు రీమేక్ సినిమాలు చేయడం అవసరమా అంటారు మరికొందరు స్ట్రైట్ సినిమాలు చేయొచ్చు కదా అంటారు.ఇలా ఎవరో చెబితే మెగా అభిమానులుగా మనం ఆ మాటలను ఎందుకు నమ్మాలి.సినిమా ఇండస్ట్రీలో ఎంతో సక్సెస్ అందుకున్నటువంటి చిరంజీవి గారికి ఎలాంటి సినిమాలు చేయాలో తనకు తెలుసు సినిమా అంటే ఆయనకు అమ్మకం కాదు నమ్మకం.
ఒక మోకాలికి ఆపరేషన్ చేయించుకొని స్టెప్స్ వేస్తున్నారు. ఆయన సంపాదించిన సంపాదన, ఆయన సంపాదించిన కీర్తి ఎంత.అయినా సరే ఆయన మనం అందరి కోసం కష్టపడుతున్నారు.మనం కూడా కలిసే ఉండాలి అంటూ ఈ సందర్భంగా ఎస్ కే ఎన్ తెలిపారు.







