మహేష్ బాబు సౌందర్య హీరో హీరోయిన్స్ గా మిస్ అయినా సినిమా ఏంటో తెలుసా ?

యమలీల( yamaleela )… ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చి అతి పెద్ద విజయాన్ని సాధించింది ఈ చిత్రం.ఈ చిత్రం 1994లో విడుదలైంది.

 How Yamaleela Missed For Mahesh Babu And Soundarya, Mahesh Babu, Soundarya, S V-TeluguStop.com

అలాగే ఈ సినిమాలో ఇంద్రజ మరియు అలీ హీరో హీరోయిన్స్ గా నటించగా కైకాల సత్యనారాయణ( Kaikala Satyanarayana ) యముడుగా నటించి యమలీల సినిమా విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు.ఈ సినిమా విజయం సాధించిన తర్వాత ఆలి హీరోగా చాలా చిత్రాల్లో హీరోగా నటించాడు.

ఇంద్రజ సైతం హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీలో మంచి నటి అని అనిపించుకుంది.ఎస్ వి కృష్ణారెడ్డి కెరియర్ లో కూడా ఇదొక మంచి సినిమాగా నిలిచిపోయింది.

అయితే ఈ సినిమాకి మొదటగా అనుకున్న హీరో హీరోయిన్స్ ఇంద్రజ మరియు ఆలీ కాదు అనే విషయం తాజాగా వైరల్ గా మారింది .

Telugu Mahesh Babu, Soundarya, Yamaleela-Movie

అయితే ఎస్వీ కృష్ణారెడ్డి ఈ కథను తయారు చేసిన సమయంలో మొదటగా ఈ సినిమాలో హీరోగా మహేష్ బాబు( Mahesh Babu ) హీరోయిన్ గా సౌందర్య ఉంటే బాగుంటుందని అనుకున్నారట.వారి కోసమే ఈ కథను కూడా సిద్ధం చేశారట.మహేష్ బాబు తో సినిమా చేయించాలని అలాగే ఈ సినిమా కథ కృష్ణ గారికి వినిపించిన సమయంలో మరొక మూడేళ్ల పాటు ఆగాలని మహేష్ చాలా చిన్నవాడు అని అప్పుడే హీరోగా పరిచయం చేయలేను అంటూ తెలిపారట.

ఈ సినిమా విడుదలైన సమయానికి మహేష్ బాబుకి కేవలం 19 ఏళ్ళు మాత్రమే.ఇక సౌందర్య వయసు 22 ఏళ్ళు.సౌందర్య మహేష్ బాబు కన్నా మూడు సంవత్సరాలు పెద్దది.

Telugu Mahesh Babu, Soundarya, Yamaleela-Movie

ఈ సినిమా విడుదలైన తర్వాత ఐదేళ్లకి రాజకుమారుడు సినిమాతో మహేష్ బాబు హీరోగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.ఇలా సౌందర్య తో కలిసి నటించే అవకాశం మహేష్ బాబు చేజారిపోయింది.ఏది ఏమైనా మహేష్ లాంటి ఒక హీరో యమలీల సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఉండి ఉంటే అతడి కెరియర్ ఈ రేంజ్ లో ఉండేది కాదేమో.

ఆ రోజు కృష్ణ గారు తీసుకున్న నిర్ణయం కచ్చితంగా కరెక్టే అనిపిస్తుంది కదా.మీకు కూడా కరెక్టే అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube